నా సామిరంగా.. ‘స్పైసీ’ సోయగం!

Posted By: Super

 నా సామిరంగా.. ‘స్పైసీ’ సోయగం!

దేశీయ బ్రాండ్ స్సైస్ రూ.1,700 ధరలో అత్యుత్తమ శ్రేణి డ్యూయల్ సిమ్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. డ్యూయల్ సిమ్, స్టాండర్డ్ మల్టీ మీడియా ఆప్షన్స్, మెరుగైన మెమెరీ, పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్ తదితర ఆసక్తికర అంశాలతో సమృద్ధిగా డిజైన్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్ మన్నికైన మొబైలింగ్‌ను చేరువచేస్తుందనటంలో ఏవిధమైన అతిశయోక్తిలేదు. ‘స్పైస్ ఎమ్5363’ మోడల్‌లో మార్కెట్లోకి అడుగుపెడుతున్నఈ తక్కువ ధర హైక్వాలిటీ డ్యూయల్ సిమ్‌ఫోన్ కీలక ఫీచర్లు.....

డ్యూయల్ సిమ్,

ఫోన్ బరువు 102 గ్రాములు,

స్ర్కీన్ పిరిమాణం 2.4 అంగుళాలు(QVGA TFT LCD),

రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,

1.3 మెగా పిక్సల్ కెమెరా (డిజిటల్ జూమ్, వీడియో రికార్గింగ్),

హై క్వాలిటీ వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్,

ఎఫ్ఎమ్ రేడియో,

బ్లూటూత్,

8జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ,

2జీ నెట్ వర్క్ సపోర్ట్,

టార్చ్ లైట్ ఫీచర్,

1800ఎమ్ఏహెచ్ Li-Ion బ్యాటరీ,

ధర రూ.1700 (అంచనా).

స్పైస్ నుంచి మరిన్నిఫోన్‌లు:

స్పైస్ స్లెల్లార్ హారిజన్: జూన్ చివరి నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. 5 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, ధర రూ.11,999

స్టెల్లార్ క్రేజ్: జూన్ చివరి నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. 3.5 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం. వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ధర రూ.6,499.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot