స్పైస్ ‘Mi 280’.. మీ దూకుడుకు రెట్టింపు!!!

Posted By: Prashanth

స్పైస్ ‘Mi 280’.. మీ దూకుడుకు రెట్టింపు!!!

 

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో హాట్ హాట్ గా అమ్ముడవుతున్న బ్రాండ్ ‘స్పైస్’ (Spice), ఈ సంస్థ రూపొందింస్తున్న ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్ లు అనతి కాలంలోనే విశేష ఆదరణను చొరగున్నాయి. నేటి తరం వినియోగదారుడు కోరుకుంటున్న వేగాన్ని, మన్నికను, స్టైల్ ను సమపాళ్లలో జోడిస్తూ ఈ స్పైసీ బ్రాండ్ ఉత్పత్తి చేస్తున్న కమ్యూనికేషన్ గ్యాడ్జెట్ లు బేష్ అనిపించుకుంటున్నాయి.

తాజాగా స్పైస్ నుంచి విడుదలైన మరో స్మార్ట్‌ఫోన్ ‘Mi 280’. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఆడ్వాన్సుడ్ డేటా ట్రాన్స్‌ఫర్ అదేవిధంగా వేగవంతంగా స్పందించే కనెక్టువిటీ ఆప్షన్‌లను ఒదిగి ఉంది. ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ 2.3 వోఎస్ పై డివైజ్ రన్ అవుతుంది. 2.8 అంగుళాల క్వాలిటీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ను కలిగిస్తుంది.

ప్రాసెసింగ్ అంశాలను పరిశీలిస్తే నిక్షిప్తం చేసిన 650 MHz ప్రాసెసర్ వేగవంతమైన పని గుణాన్ని కలిగి ఉంటుంది. లావాదేవీలను సెకన్ల వ్యవధిలో చక్కబెడుతుంది. పొందుపరిచిన 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా మధురమైన అనుభూతులను పదిలపరుస్తుంది. ఏర్పాటు చేసిన మీడియా ప్లేయర్ వినోదపు అవసరాలను పూర్తి స్థాయిలో తీురుస్తుంది.

డేటా ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్‌లైన జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, ఆండ్రాయిడ్ వెబ్‌కిట్ బ్రౌజర్‌లు డివైజ్ ఇంటర్నెట్ సమార్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కనెక్టువిటీ ఫీచర్లైన బ్లూటూత్, వై-ఫైలు కమ్యూనికేషన్ వవ్యస్థను పటిష్టితం చేస్తాయి. మొబైల్ స్టోర్‌లలో స్సైస్ ‘Mi 280’ డ్యూయల్ సిమ్ మొబైల్ ధర రూ.5,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot