స్పైస్, శ్యామ్‌సంగ్ మద్య యుద్దం..

Posted By: Super

స్పైస్, శ్యామ్‌సంగ్ మద్య యుద్దం..

దేశీయ మొబైల్ దిగ్గజం స్పైస్ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. స్పైస్ ఇటీవల విడుదల చేసిన స్పైస్ ఎమ్ఐ 270 మార్కెట్లో మంచి సక్సెస్‌ని సాధిస్తుంది. ఇది ఇలా ఉంటే దీనికి పోటీగా శ్యామ్‌సంగ్ హై ఎండ్ మొబైల్ హ్యాండ్ సెట్స్ అయిన కార్బీ హ్యాండ్ సెట్స్‌కి సంబంధించి రెండవ ఎడిషన్ కార్బీ హ్యాండ్ సెట్స్‌ని శ్యామ్‌సంగ్ కార్బీ II పేరుతో మార్కట్లోకి విడుదల చేయనుంది.

రెండు మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవడం ఇక్కడ విశేషం. స్పైస్ ఎమ్ఐ 270 ఫీచర్స్‌ని గనుక చూసినట్లేతే 7 cm పుల్ టచ్ స్క్రీన్‌తో QVGA డిస్ ప్లేని కలిగి ఉంది. ఇందులో రన్ అయ్యేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ 2.2 Froyo. అంతేకాకుండా డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉన్న ఈ మొబైల్ మార్కెట్లో ఇప్పుటికే మంచి హైప్‌ని సొంతం చేసుకుంది. ఇక శ్యామ్‌సంగ్ కార్బీ కేటగిరిలో విడుదల చేయనున్న మరో మొబైల్ ఫోన్ శ్యామ్‌సంగ్ కార్బీ II ఎస్3850 మొబైల్ ఫోన్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 3.2 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే దీని సొంతం.

శ్యామ్‌సంగ్ కార్బీ II ఎస్3850, స్పైస్ ఎమ్ఐ 270 రెండు మొబైల్స్‌లలో కూడా 2మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. శ్యామ్‌సంగ్ కార్బీ II ఎస్3850 మొబైల్‌తో పాటు 26 ఎమ్‌బి ఇంటర్నల్ మొమొరీ లభించగా, ఇందులో ఉన్న T-Flash కార్డ్ ద్వారా మొమొరీని 16జిబి వరకు విస్తరించుకొవచ్చు. పవర్ మేనేజ్ మెంట్ విషయానికి వస్తే స్పెస్ టాక్ టైం 3 గంటలు పాటు ఇవ్వగా, అదే శ్యామ్‌సంగ్ మొబైల్ 9గంటల 30 నిమిషాలు పాటు బ్యాటరీని ఇస్తుంది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ వర్సన్ 3.0ని సపోర్ట్ చేయగా, జిపిఆర్‌ఎస్, ఎడ్జి టెక్నాలజీలను కూడా సపోర్ట్ చేస్తాయి.

మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. ఇండియన్ మొబైల్ మార్కెట్లో శ్యామ్‌సంగ్ కార్బీ II ఎస్3850 మొబైల్ ధర సుమారుగా రూ 4,969 ఉండగా, అదే స్పైస్ ఎమ్ఐ 270 మొబైల్ ధర సుమారుగా రూ 5,200గా నిర్ణయించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot