అదిరే లుక్స్‌తో విడుదలకు సిద్దమైంది...

Posted By: Super

అదిరే లుక్స్‌తో విడుదలకు సిద్దమైంది...

దేశీయ మొబైల్ దిగ్గజం స్పైస్ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి మొట్టమొదటి డ్యూయల్ సిమ్ జిఎస్ఎమ్ ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్‌ని ప్రవేశపెట్టనుంది. స్పైస్ కంపెనీ మొబైల్ మార్కెట్లో పాగా వేసేందుకు గాను బేసిక్ మోడల్స్‌ను, హై ఎండ్ హ్యాండ్ సెట్స్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే మార్కెట్లోకి స్పైస్ డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్ స్పైస్ ఎమ్ఐ 350ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

స్పైస్ ఎమ్ఐ 350 మొబైల్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.5 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది. స్పైస్ ఎమ్ఐ 350 మొబైల్‌ని ఇండియన్ మార్కెట్లోకి రానున్న మూడు రోజుల్లో విడుదల చేయనున్నామని స్పైస్ ఇండియా జనరల్ మేనేజర్ గాబా తెలియజేశారు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్ 2.3 జింజర్ బ్రెడ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది.

సాధారణ స్మార్ట్ ఫోన్స్ మాదిరే ఇది కూడా అన్ని ఫీచర్స్‌ని కలిగి ఉంది. మొబైల్ స్క్రీన్ డిస్ ప్లే విషయానికి వస్తే కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇందులో మల్టీ టాస్కింగ్ పనులను చకచకా చేసేందుకు గాను Qualcomm 600 MHz ప్రాసెసర్‌ తో పాటుగా 512 MB RAM, 512 MB ROM. ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే జిపిఎస్, బ్లూటూత్‌లను కలిగి ఉంది. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్ ధర ఇండియన్ మార్కెట్లో సుమారుగా రూ 9,000 వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణులు భావిస్తున్నారు. రాబోయే కాలంలో స్పైస్ మొబైల్స్ నుండి మరిన్ని మొబైల్స్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot