స్పైస్ క్యూటి 53 ఫీచర్స్ సింప్లీ మైండ్ బ్లోయింగ్..

Posted By: Super

స్పైస్ క్యూటి 53 ఫీచర్స్ సింప్లీ మైండ్ బ్లోయింగ్..

దేశీయ మొబైల్ దిగ్గజం స్పైస్ మార్కెట్లోకి కొత్త మొబైల్ ఫోన్‌ని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. దాని పేరే స్పైస్ క్యూటి 53. స్పైస్ విడుదల చేయనున్నస్పైస్ క్యూటి 53 ఫీచర్స్‌ని గనుక గమనించినట్లైతే క్వర్టీ కీప్యాడ్ దీని సొంతం. అంతేకాకుండా డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉండడం వల్ల ఇండియన్ మార్కెట్లో దీనికి హై డిమాండ్ ఉంటుందని మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్పైస్ క్యూటి 53 మొబైల్ యొక్క స్క్రీన్ డిస్ ప్లే సైజు 2.0 ఇంచ్‌గా ఉండి టిఎఫ్‌టి స్క్రీన్‌తో పాటు 176 X 220 ఫిక్సల్ రిజల్యూషన్ దీని సొంతం. ఇక కెమెరా విషయానికి వస్తే 0.3 మెగా ఫిక్సల్ కెమెరాతో చక్కని ఇమేజిలను తీయగలుగుతుంది. సాధారణ మొబైల్ ఫోన్స్ మాదిరే ఇది విజిఎ కెమెరాని కలిగి ఉంది. అందువల్ల దీని ధర కూడా తక్కవగా ఉండడమే కాకుండా బేసిక్ హ్యాండ్ సెట్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు ఈ మొబైల్‌లో ఎఫ్ ఎమ్ రేడియో, రికార్డింగ్ చేసేందుకుగాను ఆఫ్షన్‌ని కూడా కలిగి ఉంది.

మొబైల్‌తో పాటు కొంత ఇంటర్నల్‌గా మొమొరీ వస్తుండగా మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 8జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. మార్కెట్లో ఉన్నWMA, MP4 ఆడియో, వీడియో పార్మెట్లను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఫీచర్ అయిన బ్లూటూత్‌ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా మొబైల్ తోపాటు లభించేటటువంటి యుఎస్‌బి పోర్ట్ సహాయంతో వేరే డివైజెస్‌కి కూడా కనెక్ట్ చేసుకొవచ్చు.

మొబైల్ తోపాటు ప్రత్యేకంగా పౌలీ ఫోనిక్, ఎమ్‌పి3 రింగ్ టోన్స్ ఉచితం. ఇక పవర్ సిస్టమ్ బాగా పని చేసేందుకు గాను ఇందులో 800 mAH Li-ion బ్యాటరీని పోందుపరచడం జరిగింది. మొబైల్ బరువు కేవలం 94 గ్రాములు మాత్రమే. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలకానున్న మొబైల్ ధరను మార్కెట్లోకి ఇంకా ప్రకటించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot