స్పైస్ స్టెల్లార్ 360@రూ.4,799
దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ స్పైస్ స్టెల్లార్ 360 (Stellar 360) పేరుతో తొలి టచ్ అండ్ టైప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.4,799. మెసేజ్ చాటింగ్‌కు అనువుగా ప్రత్యేకమైన క్వర్టీ కీప్యాడ్ వ్యవస్థను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. ప్రముఖ రిటైలర్ అమెజాన్ ఇండియా, సాహోలిక్‌లు ఈ స్మార్ట్
హ్యాండ్‌సెట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్),
512ఎంబి ర్యామ్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు ( 3జీ కనెక్టువిటీ, వై-ఫై, ఏ- జీపీఎస్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, యూఎస్బీ),
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 192 గంటల స్టాండ్‌బై టైమ్).
వైట్ కలర్ వేరియంట్‌లో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications