స్పైస్ స్టెల్లార్ 509: చవక ధర క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్

Posted By:

తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు 2014 బ్రహ్మరథం పడుతోంది. మోటరోలా, నోకియా, మైక్రోమాక్స్, లావా, కార్బన్ వంటి బ్రాండ్‌లు చవక ధర స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడదుల చేసి తమ దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలో మరో దేశవాళీ స్మార్ట్‌‍ఫోన్‌ల తయారీ కంపెనీ స్పైస్ తన స్టెల్లార్ సిరీస్ ‘స్టెల్లార్ 509' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ను విపణిలోకి తీసువచ్చింది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ హోమ్‌షాప్18 (HomeShop18) ద్వారా స్పైస్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,999కి విక్రయిస్తోంది.

స్పైస్ స్టెల్లార్ 509: చవక ధర క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ, డ్యూయల్ సిమ్, ఎఫ్ఎమ్ రేడియో, జీపీఎస్, ఏ-జీపీఎస్).
ప్రీలోడెడ్ ఫీచర్లు : స్పైస్ క్లౌడ్, ఒపెరా మినీ, ఓఎల్ఎక్స్, గెటిట్, గ్రీట్‌జాప్.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting