స్పైసీ..స్పైసీగా!!

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ స్పైస్, స్టెల్లార్ సిరీస్ నుంచి మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటి పేర్లు స్పైస్ స్టెల్లార్, స్టెల్లా హారిజన్, స్లెల్లార్ క్రేజ్. వీటి స్ర్కీన్ పరిమాణాలు 3.5, 4, 5 అంగుళాలుగా ఉంటాయి. యాంటీ వైరస్ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను ముందుగానే ఈ హ్యాండ్‌సెట్‌లలో లోడ్ చేసి ఉంచారు. ఈ సౌలభ్యతతో డేటా లాస్, వైరస్ లాంటి ప్రమాదాల నుంకి ఫోన్‌లు సురక్షితంగా బయటపడతాయి. పూర్తి స్థాయి మొబైలింగ్ అనుభూతులతో పాటు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ ఫోన్‌ల ద్వారా యూజర్ ఆశించవచ్చు.
స్పైస్ స్టెల్లార్:
కొద్ది గంటల క్రితమే ఈ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. 4 అంగుళాల టచ్‌స్ర్కీన్, పొందుపరిచిన 2000 mAh బ్యాటరీ 7 గంటల టాక్ టైమ్, 120 గంటల స్టాండ్ బై నిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు. ముందు భాగంలో ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా ప్రత్యక్ష వీడియో చాటింగ్ నిర్వహించుకోవచ్చు.
స్పైస్ స్లెల్లార్ హారిజన్:
జూన్ చివరి నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. 5 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, ధర రూ.11,999
స్టెల్లార్ క్రేజ్:
జూన్ చివరి నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. 3.5 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం. వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ధర రూ.6,499.


Click it and Unblock the Notifications