ఏది హిట్టు.. ఏది ఫట్టు?

సామ్సంగ్ గెలాక్సీ నోట్‌తో ప్రారంభమైన ఫాబ్లెట్‌ల సంస్కృతి క్రమక్రమంగా విస్తరిస్తోంది. టాబ్లెట్ అదేవిధంగా స్మార్ట్‌ఫోన్ లక్షణాలను ఒదిగి ఉండే ఈ డివైజ్‌కు ప్రస్తుత మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. ఈ డివైజ్‌లను ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు మార్కెట్లో విడుదల చేసాయి. తాజాగా ఈ విభాగం నుంచి స్పైస్, ఐబాల్‌లు పోటాపోటీగా రెండు ఫాబ్లెట్‌లను డిజైన్ చేసాయి. ‘స్పెస్ స్టెల్లార్ హారిజన్’, ‘ఐబాల్ ఆండీ 5సీ’ మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్‌లు డ్యూయల్ సిమ్ అదేవిధంగా ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టంను కలిగి ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ.....
బరువు ఇంకా చుట్టుకొలత:
ఐబాల్ ఆండీ 5సీ: వివరాలు తెలియాల్సి ఉంది.
స్పెస్ స్టెల్లార్ హారిజన్: 143 x 77.4 x 10.5మిల్లీమీటర్ల శరీర పరిమాణం, బరువు 205 గ్రాములు,
డిస్ ప్లే:
ఐబాల్ ఆండీ 5సీ: 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
స్పెస్ స్టెల్లార్ హారిజన్: 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ప్రాసెసర్:
ఐబాల్ ఆండీ 5సీ: 1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
స్పెస్ స్టెల్లార్ హారిజన్: 1గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం:
ఐబాల్ ఆండీ 5సీ: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
స్పెస్ స్టెల్లార్ హారిజన్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా:
ఐబాల్ ఆండీ 5సీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
స్పెస్ స్టెల్లార్ హారిజన్: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
స్టోరేజ్:
ఐబాల్ ఆండీ 5సీ: 4 జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
స్పెస్ స్టెల్లార్ హారిజన్: 4 జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ:
ఐబాల్ ఆండీ 5సీ: 3జీ, బ్లూటూత్, వై-ఫై 802.11 b/g/n, మైక్రోయూఎస్బీ 2.0,
స్పెస్ స్టెల్లార్ హారిజన్: 3జీ, బ్లూటూత్, వై-ఫై 802.11 b/g/n, మైక్రోయూఎస్బీ 2.0,
బ్యాటరీ:
ఐబాల్ ఆండీ 5సీ: 2400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
స్పెస్ స్టెల్లార్ హారిజన్: 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర:
ఐబాల్ ఆండీ 5సీ: రూ.12,999,
స్పెస్ స్టెల్లార్ హారిజన్: పై పేర్కొన్న ధరతో పోలిస్తే కొంచం అధికం.
తీర్పు:
ఆధునిక ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ రెండు గ్యాడ్జెట్ లు ఇంచుమించు సమాన అనుభూతులను చేరువ చేస్తాయి. స్పెస్ స్టెల్లార్ హారిజన్ లో లోడ్ చేసిన యాంటీ-వైరస్, యాంటీ-తెఫ్ట్ సాఫ్ట్ వేర్ లు ఫాబ్లెట్ కు రక్షణ కవచంలా నిలుస్తాయి. మరో వైపు ఐబాల్ ఆండీ 5సీలో లోడ్ చేసిన ఫేస్ అన్ లాక్, కంట్రోల్ ఓవర్ నెట్ వర్క్ డేటా, ఫోటో ఎడిటర్, రెడ్-ఐ రిమూవర్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
ఈ గ్యాడ్జెట్ల కొనుగోలు విషయంలో ధర పరంగా ఆలోచించే వారికి స్పెస్ స్టెల్లార్ హారిజన్ బెస్ట్ చాయిస్ కాగా, ఎక్కువ ఫీచర్లను కోరుకునే వారికి ఐబాల్ ఆండీ 5సీ ఉత్తమ ఎంపిక.


Click it and Unblock the Notifications







