స్పైస్ సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్

Posted By: Super

స్పైస్ సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్

 

స్పైస్ మొబైల్స్ సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్ పేరు  ‘స్టెల్లార్ ఎక్స్‌టసీ ఎమ్ఐ-352’. ప్రముఖ ఆన్‌లైన్ సైట్ సాహోలిక్ డాట్ కామ్  రూ.4,634కు ఈ డివైజ్‌ను

ఆఫర్ చేస్తోంది. ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని స్పైస్ ఈ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. స్పైస్ కోవలోనే మైక్రోమ్యాక్స్, కార్బన్, ఇంటెక్స్, లావా తదితర దేశవాళీ బ్రాండ్‌లు ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి.

టాప్-10 బెస్ట్ కంపెనీలు (ఉద్యోగానికి)

టాప్-10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (మీకు నచ్చిన ధరల్లో)!

స్పెసిఫికేషన్‌లు:

3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్7225ఏబి ప్రాసెసర్, 512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, 256ఎంబి ర్యామ్,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, 1300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (3.5 గంటల టాక్‌టైమ్, 9 గంటల స్టాండ్‌బై).

స్పైస్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఫోన్ ‘విర్ట్యూసో ఎమ్ఐ-495’

స్పైస్ మొబైల్స్ తన స్టెల్లార్ సిరీస్ నుంచి ‘విర్ట్యూసో ఎమ్ఐ-495’ మోడళ్లలో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. వన్ గ్లాస్ సొల్యూషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో వినియోగించారు. ధర రూ. 10,499. స్పెసిఫికేషన్‌లు……

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),

వన్ గ్లాస్ సొల్యూషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా ( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్),

3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,

1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై).

ఫోన్ కొనుగోలు పై రూ.1,000 విలువ చేసే లెదర్ కవర్ ఇంకా స్ర్కీన్ గార్డ్‌ను ఉచితంగా పొందవచ్చు. 50,000 రిటైల్ పాయింట్‌ల వద్ద ఈ డివైజ్ లభ్యంకానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot