ఆ సం‘బంధం’ వెనుక డీల్ ఏంటి?

Posted By: Prashanth

ఆ సం‘బంధం’ వెనుక డీల్ ఏంటి?

 

ప్రముఖ దేశీయ ఫోన్ మేకర్ స్పైస్, చైనాకు చెందిన హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ హువావీతో ఓ ఒప్పందాన్ని ఏర్పరుచుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఇరువురి భాగస్వామ్యంతో ‘ఎస్ హువావీ 7’ బ్రాండ్ స్మార్ట్‍‌ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా స్పైస్ 7 నుంచి 10 కో-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టనుంది. జూన్ 2013 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల హ్యాండ్‌సెట్‌లను విక్రయించాలన్నది వీరి లక్ష్యం. ఇప్పటికే స్పైస్ ‘ఎసెండ్ వై100’ పేరుతో హువావీ డిజైన్ చేసిన 3జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,990కు మార్కెట్లో విక్రయిస్తోంది. ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, టాటా డొకొమో వంటి ప్రముక టెలికం సంస్థలతో ఒప్పందం కుదర్చుకున్న స్పైస్ గ్రూప్స్ దేశీయంగా తమ ఫోన్‌ల కొనుగోళ్ల పై ఉచిత 3జీ డేటా ప్లాన్‌లను అందిస్తోంది. స్పైస్ గ్రూప్స్‌కు ఇండియా, సింగపూర్, ఇండోనేషియా, మాలేసియా, థాయిల్యాండ్ ఇంకా ఆఫ్రికాలోని పలు ప్రాంతాలతో కలుపుకుని మొత్తం 5,000 స్టోర్ లు ఉన్నాయి.

ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘ఎసెండ్ వై100’ ఫీచర్లు:

2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

రిసల్యూషన్ 320 × 240పిక్సల్స్,

800మెగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్,

3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

256ఎంబీ ర్యామ్,

512ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ(మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్),

వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ,

ఇండియన్ మార్కెట్లో ఎసెండ్ వై100 ధర రూ.5,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot