Home
Mobile

పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతోంది!

By Super
 Spice to launch a 5 inch Android smartphone


దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ ‘స్పైస్’ ప్రణాళికాబద్ధంగా మార్కెట్ పై పట్టుబిగిస్తోంది. ఇండియన్ మార్కెట్లో డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను లాంచ్ చేసిన తొలి దేశీయ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న స్పైస్ భిన్నమైన స్ర్కీన్ వేరియంట్‌లలో ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఫోన్‌లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే స్పైస్ Flo Me M6868N, FLO TV M5600 మోడళ్లలో రెండు హ్యాండ్‌సెట్‌‍లను లాంచ్ చేసింది. తాజాగా 5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందకు కసరత్తులు చేస్తోంది. తక్కువ ధరకు లభ్యం కానున్నఈ డివైజ్ ‘సామ్‌సంగ్ గెలాక్సీ నోట్’కు పోటీదారుకానుంది.

మరో వైపు పూర్తిస్థాయి సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందకు స్పైస్ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. మూడు మోడళ్లలో ఈ హ్యాండ్‌సెట్లు విడుదల కానున్నాయి. యాంటీ – తెఫ్ట్, యాంటీ వైరస్ వంటి సమర్థవంతమైన సెక్యూరిటీ ఫీచర్లను ఈ డివైజుల్లో లోడ్ చేస్తున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతానిక ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. త్వరలో ఈ వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేయునున్నారు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X