చైనా మార్కెట్లో లాంచ్ అయిన మొట్టమొదట 'ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌'

చైనాకు చెందిన Royole కార్పొరేషన్‌ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదట 'ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌'ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది.

|

చైనాకు చెందిన Royole కార్పొరేషన్‌ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదట 'ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌'ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ తరహా ఫోన్‌లు ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థలైన శాంసంగ్‌, ఎల్‌జీ,హువావే సంస్థల వద్ద ఇంకా అభివృద్ధి దశలోనే ఉండగా చైనా సంస్థ మాత్రం 'ఫ్లెక్సీ పై' పేరుతో 'ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌'ను మార్కెట్లోకి తెచ్చింది. డిస్‌ప్లే ను మడత పెట్టేందుకు వీలుగా దినిని రూపొందించారు.ఈ ఫోన్లు డిసెంబరు నుంచి చైనాలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ తెలిపింది.

జాగ్రత్త : ఫోన్ రిపేర్‌కి ఇస్తే రూ.91వేలు కొట్టేశారుజాగ్రత్త : ఫోన్ రిపేర్‌కి ఇస్తే రూ.91వేలు కొట్టేశారు

రెండు లక్షల సార్లు మడత బెట్టి పరీక్షించామని....

రెండు లక్షల సార్లు మడత బెట్టి పరీక్షించామని....

ఈ ఫోన్‌ను ప్రయోగాత్మకంగా రెండు లక్షల సార్లు మడత బెట్టి పరీక్షించామని అయినా డిప్ల్సేలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదని చైనా సంస్థ తెలిపింది. కాబట్టి ఈ ఫోన్‌ డిస్‌ప్లే పై దృశ్యం ఏళ్ల పాటు ఏ అవాంతరం లేకుండా కనిపిస్తుందని సంస్థ వెల్లడించింది.

డిస్‌ప్లే పైభాగంలో 16 ఎంపీ, 20 ఎంపీ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలు....

డిస్‌ప్లే పైభాగంలో 16 ఎంపీ, 20 ఎంపీ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలు....

డిస్‌ప్లే పైభాగంలో 16 ఎంపీ, 20 ఎంపీ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలను కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ఫోన్‌ను మడతబెట్టినప్పుడు వెనుక కెమెరాగా, మామూలుగా ఉంచినప్పడు ఫ్రంట్‌ కెమెరాగా పనిచేస్తుంది.

7.8 అంగుళాల  డిస్‌ప్లే....

7.8 అంగుళాల డిస్‌ప్లే....

దీనిని 7.8 అంగుళాల డిస్‌ప్లే. 3,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో సున్నిత ఆపరేషన్‌కు కూడా పని చేసేలా రూపొందించినట్టుగా కంపెనీ తెలిపింది. దీని ధర ఫోన్‌ వేరియంట్‌ను బట్టి రూ.90 వేల నుంచి రూ.1.2 లక్షల మధ్య ఉండనున్నట్టుగా సమాచారం.

సామ్‌సంగ్ నుంచి ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్..

సామ్‌సంగ్ నుంచి ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్..

సామ్‌సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గురించి గత కొంత కాలంగా అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా తెలియవచ్చిన సమచారం ఈ ఫోన్‌కు సంబంధించిన ఫైనల్ ప్రొటోటైప్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలోనే ఈ ప్రోటోటైప్ ప్రపంచానికి పరిచయం కాబోతోంది. Bloomberg రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించి ఓ స్పెషల్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను సామ్‌సంగ్ అభివృద్థి చేయిస్తోందట. ఇందుకుగాను గూగుల్‌తో కలిసి సామ్‌సంగ్ పనిచేస్తోంది.

 

 

హువావే నుంచి ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్..

హువావే నుంచి ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్..

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ల పై పరిశోధనలు ముమ్మరమవుతోన్న నేపథ్యంలో చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హువావే , ఓ ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్ పై వర్క్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2018 చివరి నాటికి మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హువావే సీఈఓ రిచర్డ్ యు, ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు.

ల్యాప్‌టాప్‌లతో పోటీపడే సత్తా..

ల్యాప్‌టాప్‌లతో పోటీపడే సత్తా..

తాము అభివృద్థి చేస్తోన్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చినట్లయితే ల్యాప్‌టాప్‌లు పూర్తిగా కనుమరుగు అయిపోతాయని అన్నారు. స్మార్ట్‌ఫోన్‌లు చిన్న చిన్న స్ర్కీన్‌లను కలిగి ఉండటం కారణంగా ల్యాప్‌టాప్‌ల హవా ఇంకా కొనసాగుతోందని, బెండబుల్ ఫోన్‌ల రాకతో ఆ పరిస్థితి మారిపోబోతోందని ఆయన తెలిపారు. ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ స్ర్కీన్‌ను ప్రొవైడ్ చేసే వీలుండటంతో ఇవి ల్యాప్‌టాప్‌లతో సమానంగా పనచేయగలుగుతాయట.

సామ్‌సంగ్, హువావేల మధ్య పోటీ..

సామ్‌సంగ్, హువావేల మధ్య పోటీ..

ల్యాప్‌టాప్‌లతో పోటీపడగలిగే బెండబల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాదిలోపు కమర్షియల్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు యు తెలిపారు. ఇదే సమయంలో సామ్‌సంగ్ కూడా తన మొదటి కన్స్యూమర్ గ్రేడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్, హువావే ఫోల్డబుల్ టైప్ ఫోన్‌ల మధ్య భీకర పోరు నెలకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రాలేమంటోన్న సామ్‌సంగ్..

ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రాలేమంటోన్న సామ్‌సంగ్..

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ మొబైల్ చీఫ్ డీజీ కోహ్ స్పందిస్తూ, తాము ఫ్లెక్సిబుక్స్ స్ర్కీన్స్ అలానే దాని సంబంధిత టెక్నాలజీలను వినియోగించుకుని సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నామని, అయితే ఇవి ల్యాప్‌టాప్‌లకు ప్రత్యామ్నాయంగా నిలబడతాయని తాము అనుకోవటం లేదని అన్నారు. ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండస్ట్రీ పై ఏ విధమైన ప్రభావాన్ని చూపుబోతున్నాయి అనే దానే పై ఇంకా స్పష్టమైన అంచనాకు తాము రాలేదని ఆయన తెలిపారు.

సామ్‌సంగ్, హువావే బాటలో షియోమి కూడా...

సామ్‌సంగ్, హువావే బాటలో షియోమి కూడా...

హువావే బాటలోనే షియోమి కూడా ఓ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్థి చేస్తున్నట్లు రూమర్స్ మిల్స్ కోడై కూస్తున్నాయి. ఈ ఫోన్‌లకు సంబంధించి షియోమి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ న్యూస్ అందుబాటులో లేదు. ఇదే సమయంలో ఒప్పో కూడా ఓ బెండబుల్ ఫోన్ అభివృద్థి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Start-up beats major players to launch world's first foldable smartphone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X