అక్టోబర్ 24న మహానుభావుడి బయోగ్రఫీ విడుదల

Posted By: Staff

అక్టోబర్ 24న మహానుభావుడి బయోగ్రఫీ విడుదల

స్టీవ్ జాబ్స్ ఈరోజు మనం అతని గురించి మాట్లాడుకొవడానికి కారణం డిజిటల్ ప్రపంచంలో యాపిల్ కంపెనీని రారాజు గా నిలిపిన వ్యక్తి మాత్రమే కాదు, టెక్నాలజీని ఎలా వాడుకొవాలో ప్రపంచ జనాభాకి చాటి చెప్పిన వ్యక్తే స్టీవ్ జాబ్స్. 56 సంవత్సరాల వయసులో క్యాన్సర్ భాదతో ఆయన బుధవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన భార్య పక్కనే ఉన్నారు. తాను ఉదర సబంధమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు జాబ్స్ 2004లో ప్రకటించారు. ఇటీవలే ఆగస్టులో సిఇవో పదవి నుంచి వైదొలగి ఆ బాధ్యతను టిమ్ కుక్‌కు అప్పగించడం జరిగింది.

అంతటి అసమాన్య మహానుభావుడి జ్ఞాపకార్దం అక్టోబర్ 24వ తారీఖున ప్రముఖ అమెరికా పబ్లిషర్ సైమన్ & స్కుస్టర్ అనే సంస్ద స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ పేరుమీద ఓ పుస్తకాన్ని విడుదల చేయనుంది. గత ఆగస్టులో స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీని నవంబర్ 21న విడుదల చేయనున్నామని ప్రకటించినప్పటికీ కోన్ని కారణాల వల్ల విడుదల చేయేలేదు. కానీ ఈసారి మాత్రం తప్పనిసరిగా అక్టోబర్ 24న విడుదల చేసేందుకు సిద్దమయ్యామని తెలిపారు.

ఇక ఈ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ పుస్తకాన్ని ఆయన బ్రతికుండగానే ఆమోదం తీసుకొవడం జరిగిందని పుస్తకాన్ని విడుదల చేసే సైమన్ & స్కుస్టర్ ప్రతినిధి వెల్లడించారు. పుస్తకాన్ని విడుదల చేయక ముందే ఈ పుస్తకానికి ముందుగా వచ్చిన ఆర్డర్స్ చూసి వారు నివ్వెర పోవడం జరిగింది. ఈ పుస్తకం ఆయన చనిపోక ముందు 424వ స్దానంలో ఉంటే అదే ఆయన చనిపోయిన తర్వాత ఆర్డర్స్ విభాగంలో నెంబర్ వన్ స్దానానికి చేరిపోయిందని అమెజాన్ సంస్ద ప్రకటించింది.

ఇక ఈ పుస్తకాన్ని వ్రాసినటువంటి రచయిత గతంలో టైమ్ మ్యాగజైన్ మేనేజింగ్ డైరెక్టర్ వాల్టర్ ఇసాక్ సన్. ఈయన గతంలో ఆల్బర్ట్ ఐన్ స్టీన్, బెంజిమెన్ ఫ్రాంక్లెన్, హెన్రీ కిస్సింగ్జర్ లాంటి మహానుభావుల పుస్తకాలు వ్రాయడం జరిగింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting