50 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్ రూ. 1400కే..

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనిదే చాలామందికి రోజు గడవని విషయం తెలిసిందే. తిండిలేకపోయినా ఫరవాలేదు కాని మొబైల్ మాత్రం చేతిలో ఉండాల్సిందే. వారికనుగుణంగా మార్కెట్లో రకరకాల ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అయితే ఎన్ని ఫోన్లు వచ్చినా అవి బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అందరూ ఎక్కువ రోజులు బ్యాటరీ బ్యాకప్ ఫోన్ల కోసం చూస్తుంటారు. అలాంటి వారికోసం మార్కెట్లో ఓ మొబైల్ సిద్ధంగా ఉంది.

కేవలం ఒక్క ఎసెమ్మెస్‌తో జియో ఫోన్ మీ చేతికి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్ కార్ట్ లో రూ. 1440

జివి కంపెనీ Sumo T3000 పేరుతో ఓ ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీని ధర ఫ్లిప్ కార్ట్ లో రూ. 1440గా ఉంది. ఇది 50 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందట.

3600mAh బ్యాటరీ

3600mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ ని మీరు ఒకసారి చార్జింగ్ పెడితే దాదాపు 50 రోజుల పాటు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

2.8 డిస్ ప్లే

2.8 ఇంచ్ డిస్ ప్లేతో వచ్చిన ఈ ఫోన్ లో 1.3 ఎంపీ కెమెరా విత్ ఫ్లాష్, ఆటో కాల్ రికార్డ్, మొబైల్ ట్రాకర్, టార్చ్ లైట్, జీపీఆర్ఎస్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 1 ఎంబి ర్యామ్ అలాగే 10 ఎంబి ఇంటర్నల్ మెమొరీ , డ్యూయెల్ సిమ్, మైక్రో ఎస్ డి విస్తరణ లాంటి పీచర్స్ ఉన్నాయి.

వన్ ఇయర్ వారంటీ

2జీ నెట్ వర్క్ లో పనిచేసే ఈ మొబైల్ ఎంపీ3 పాటలు కూడా వినవచ్చు. జివి కంపెనీ దీనిపై వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తోంది.

చైనా ఫోన్లు కొనేవారే కరువు

మనోళ్ల దెబ్బకు తుస్సుమన్న చైనా ఫోన్లు, కొనేవారే కరువు ! మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sumo T3000: One charge can keep this phone running for 50 days Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot