అంచులులేని డిస్‌ప్లేతో గెలాక్సీ ఎస్8 అదరహో...

సామ్‌సంగ్ తన అడ్వాన్సుడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్8ను కొద్ది రోజుల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌కు Bezel-less స్ర్కీన్ ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. సామ్‌సంగ్ ఈ స్ర్కీన్‌ను ముద్దుగా ఇన్ఫినిటీ డిస్‌ప్లే అని పిలుచుకుంటోంది.

హై స్ర్కీన్-టు-బాడీ రేషియోతో సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసిన ఈ ఫోన్ భవిష్యత్ స్మార్ట్‌ఫోన్ డిజైనింగ్‌కు బలమైన పునాది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే 83% ముఖ భాగాన్ని కవర్ చేసేస్తుంది

ఒక్క మాటలో చెప్పాలంటే, Samsung గెలాక్సీ ఎస్8 ఫోన్‌ను ప్రీమియమ్ క్వాలిటీ అలానే సృజనాత్మక నైపుణ్యాలకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గెలాక్సీ ఎస్8 బాడీలో 5.8 ఇంచ్ (14.65 సెంటీ మీటర్ల) స్ర్కీన్‌ను సామ్‌సంగ్ ఫిట్ చేసింది. ఈ డిస్‌ప్లే ఫోన్‌కు సంబంధించిన 83% ముఖ భాగాన్ని కవర్ చేసేస్తుంది. ఫలితంగా అందమైన పెద్ద తెర మన కళ్లను కట్టిపడేస్తుంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేసే వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ సినీమాటిక్ అనుభూతులను చేరువచేస్తుంది.

వైబ్రెంట్ అమోల్డ్ స్ర్కీన్

ఇంచుమించుగా ముందు భాగంగా మొత్తం వ్యాపించే ఉండే ఈ ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఫోన్ ఎడ్జెస్‌ను కవర్ చేసేసింది. గెలాక్సీ ఎస్8 ఫోన్‌‌లో కనిపించే వైబ్రెంట్ అమోల్డ్ స్ర్కీన్ మునుపెన్నడూ చూడని కొత్త లుక ను ఆఫర్ చేస్తుంది.

రన్ అయ్యే ప్రతి కంటెంట్‌ క్రిస్టల్ క్లియర్ క్వాలిటీతో

గెలాక్సీ ఎస్8, ఎస్8+ మోడల్స్‌లో అమర్చిన 5.8 ఇంచ్ (14.65 సెంటీ మీటర్ల), 6.8 ఇంచ్ (15.81 సెంటీ మీటర్ల) క్యూహైడెఫినిషన్ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేలు కనువిందైన 2960*1440 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో సినీమాటిక్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తాయి. ఈ డిస్‌ప్లేలలో రన్ అయ్యే ప్రతి కంటెంట్‌ క్రిస్టల్ క్లియర్ క్వాలిటీతో డిటేల్డ్‌గా ఉంటుంది.

HDR content స్ట్రీమింగ్..

గెలాక్సీ ఎస్8 ఫోన్ ద్వారా సామ్‌సంగ్ అందిస్తోన్న ఇన్ఫినిటీ డిస్‌ప్లే, మొబైల్ హెచ్‌డీఆర్ ప్రీమియమ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉండటం విశేషం. దీంతో ఈ ఫోన్‌లలో HDR contentను స్ట్రీమ్ చేసుకోవచ్చు. టీవీ టెక్నాలజీలో బిగ్గెస్ట్ డెవలెప్‌మెంట్‌గా భావిస్తోన్న HDR టెక్నాలజీని గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‍లలోకి తీసుకురావటం నిజంగా చాలా గొప్ప విషయం. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు ఇప్పటికే HDR contentను మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి.

అసాధారణ 18.5:9 Aspect Ratio

గెలాక్సీ ఎస్8 ఫోన్‌తో వస్తోన్న అసాధారణ 18.5:9 Aspect Ratio డిస్‌ప్లే, ఎక్కువ కంటెంట్‌ను ఫ్రేమ్ లో ఫిట్ అయ్యేలా చేస్తుంది. మీరు యూట్యూబ్ లేదా ఇతర స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా వీడియోలను వీక్షిస్తున్నప్పుడు ఫోన్ Aspect Ratioకు అనుగుణంగా వీడియోను మాడిఫై చేసుకుంది. ఇందుకుగాను 'Crop to Fit', 'Fit to Screen' ఆప్షన్‌లను ఈ డిస్‌ప్లే ఉపయోగించుకుంటుంది. దీంతో సినీమాటిక్ వ్యూ సాకారమవుతుంది

హోమ్ బటన్ మరో ప్రధాన హైలెట్..

కొత్తగా డిజైన్ చేసిన హోమ్ బటన్ గెలాక్సీ ఎస్8 డిస్‌ప్లే‌కు మరో ప్రధాన హైలెట్. చాలా స్మూత్‌గా వర్క్ అయ్యే ఈ హోమ్ బటన్ ద్వారా అంతరాయంలేని స్మార్ట్ మొబైలింగ్‌ను ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Why we are in love with the Galaxy S8’s Infinity Display. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot