వన్ ఇండియాలో 'నోకియా ఎన్12' ఎక్స్‌క్లూజివ్ న్యూస్

Posted By: Staff

వన్ ఇండియాలో 'నోకియా ఎన్12' ఎక్స్‌క్లూజివ్ న్యూస్

నోకియా భారతీయుల మనసు దొచిన మొబైల్ సంస్ద. నోకియా విడుదల చేసే ప్రతి మొబైల్‌‍లోను తనయొక్క తృష్ణని కనబరుస్తుంది. ఇప్పుడు కూడా కొత్తగా మార్కెట్లోకి 'నోకియా ఎన్12'ని విడుదల చేసింది. 'నోకియా ఎన్12' మొబైల్‌ని చూస్తే యూజర్స్ ఇట్టే దానిపై మనసు పడతారనడంలో ఎటువంటి సందేహాం లేదు. బ్రహ్మాండమైన అందం దీని సొంతం. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే ప్రాక్సిమిటీ సెన్సార్స్‌తో పాటు, టిఎఫ్‌టి కెపాసిటివ్ టచ్ స్క్రీన్ టెక్నాలజీతో పాటు, టచ్ ఇన్‌పుట్ డిస్ ప్లే దీని సొంతం.

దీని చుట్టుకొలతలు 116mm x 62mm x 14mm. బరువు 135గ్రాములు. సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలవుతున్న ఈ 'నోకియా ఎన్12' మొబైల్ మార్కెట్లో తప్పకుండా సక్సెస్‌ని సొంతం చేసుకుంటుందని అధికార వర్గాలు భావిస్తున్నారు. 600 MHz పవర్ పుల్ ప్రాసెసర్‌ని ఇందులో నిక్షిప్తం చేసారు. 8 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఇమేజిలను తీయవచ్చు. బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను, మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ఉచితం.

మెమరీ విషయానికి వస్తే 512MB RAMని కలిగి ఉంది. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మెసేజింగ్ ఫీచర్స్‌ MMS, Email client ప్రత్యేకం. ఆడియో, వీడియో ఫార్మెట్లు MP4, MP3లను సపొర్ట్ చేస్తుంది. 'నోకియా ఎన్12' మొబైల్ పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో Lithium ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. టాక్ టైమ్ 5 గంటలు. స్టాండ్ బై టైమ్ 250 గంటలు.

'నోకియా ఎన్12' మొబైల్ ప్రత్యేకతలు:

* colors: white/black
* Symbian
* 2 surround speakers.
* 8 mp camera (HD video recording)
* 1Ghz processor
* 512 RAM
* Bluetooth 3
* 16GB Internal
* Micro-SD Reader
* CBD 4″ AMOLED (high resolution)
* Capacitive multi touch screen
* Dolby digital plus (with HDMI output)
* Removable cover(shell) and battery
* 16Gb internal + Micro-SD reader

ఇండియాలో 'నోకియా ఎన్12' మొబైల్ ఖరీదు సుమారుగా రూ 35,000 వరకు ఉండవచ్చునని అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot