‘సోని’ సంగ్రామం..!!!

Posted By: Prashanth

‘సోని’ సంగ్రామం..!!!

 

‘2012’ సోని ప్రియుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. కొత్త సంవత్సరం ‘సోని’ సంగ్రామానికి వేదికగా నిలవనుంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో అంతర్జాతీయంగా విశ్వసనీయతను చాటిన ‘సోని‌ఎరెక్సన్’ రెండు కొత్త నమూనాలను ఈ ఏడాది ప్రధమాంకంలో విడుదల చేయునుంది. సోని‌ఎరెక్సన్ నైఫాన్, నోజోమీగా విడుదలవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకునే స్టైల్‌ను కలిగి, సమర్ధవంతమైన పనితీరును ప్రదర్శిస్తాయి...

‘సోని ఎరెక్సన్ నోజోమీ’ ముఖ్య ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, అప్‌గ్రేడెడ్ వర్షన్ v4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు ఈ వోఎస్‌ను మార్చుకోవచ్చు, * వేగవంతమైన పనితీరుకు దోహదపడే 1GHz డ్యూయల్ కోర్ U8500 ప్రాసెసర్‌ను డివైజ్‌లో లోడ్ చేశారు, * 1జీబి ర్యామ్, * 16జీబి ఇంటర్నల్ మెమరీ, * 8 మెగా పిక్సల్ కెమెరా, * బ్యాటరీ టాక్‌టైమ్ 6.5గంటలు, * 802.11 b/g/n హై-ఫై కనెక్టువిటీ, * హై‌స్పీడ్ బ్లూటూత్ కనెక్టువిటీ, * హెచ్ఢీఎమ్ఐ పోర్ట్, * యూఎస్బీ పోర్ట్, * మల్టీ ఫార్మాట్ మీడియా ప్లేయర్.

‘సోని ఎరెక్సన్ నైఫాన్’ ముఖ్య ఫీచర్లు:

* గుగూల ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1.5 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * అడ్రినో 220 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, * 4.3 అంగుళాల మల్టీ టచ్ స్క్రీన్, * 1జీబి ర్యామ్, * 12 మెగా పిక్సల్ LED ఫ్లాష్ కెమెరా, * ప్రత్యక్ష వీడియో కాన్ఫిరెన్సింగ్ నిర్వహించుకునేందుకు సెకండరీ కెమెరా * 1080పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ, * వెబ్ బ్రౌజర్, ఆడియో ఫ్లాష్ సపోర్ట్, * 802.11 b/g/n వై-ఫై కనెక్టువిటీ, * హై స్పీడ్ v3.0 బ్లూటూత్ కనెక్టువిటీ, * మల్టీ ఫార్మాట్ మీడియా ప్లేయర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot