మైక్రోసాఫ్ట్ నుంచి మరో సంచలన ప్రొడక్ట్..
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ రహస్య స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్ల గతకొంత కాలంగా వార్తలు ఇంటర్నెట్‌లో స్పెక్యులేట్ అవుతోన్న విషయం తెలిసిందే.
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ రహస్య స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్ల గతకొంత కాలంగా వార్తలు ఇంటర్నెట్‌లో స్పెక్యులేట్ అవుతోన్న విషయం తెలిసిందే. సర్‌ఫేస్ ఫోన్ పేరుతో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ 'ఆండ్రోమేడా' అనే ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్పెషల్ వర్షన్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి మొదటి గేమ్‌ను కొద్ది గంటల క్రితమే మైక్రోసాఫ్ట్ రివీల్ చేసింది.

“Miami Heat” పేరుతో లభ్యం..
"Miami Heat" పేరుతో లాంచ్ అయిన రేసింగ్ గేమ్, ForzaMotorsport ఆఫర్ చేసే రేసింగ్ గేమ్‌లతో పోలిస్తే మరింత రియల్ టైమ్‌లో సినీమాటోగ్రాఫిక్ అనుభూతులను అనుభూతులను ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఎలక్ట్రిక్ స్క్వేర్ అనే ఈ సంస్థ ఈ గేమ్‌ను అభివృద్ధి చేసింది. విండోస్ యూజర్లు ఈ గేమ్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. ఇతర ఉచిత రేసింగ్ గేమ్స్ తరహాలోనే ఈ గేమ్‌లో కూడా మెకానికల్ ఎనర్జీ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి రీఛార్జ్ చేస్తుంటుంది.
This is Miami Street, a free-to-play street racing game.https://t.co/eZXRSgrskQ pic.twitter.com/vSrB1IA8BM— Alan Walsh (@BeetleComet) May 25, 2018 '>
మరింత క్రియేటివ్‌గా...
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మైక్రోసాఫ్ట్ తన సర్‌ఫేస్ ఫోన్‌ను మరింత క్రియేటివ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్ ఫోల్డబుల్ ఫీచర్లతో రాబోతోదంట. ఫోల్డ్ చేసుకునే విధంగా డిజైన్ కాబడుతోన్న ఈ ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో మైక్రోసాఫ్ట్ తీసుకురానుందట.

సర్‌ఫేస్ పెన్ సపోర్ట్‌తో...
సర్‌ఫేస్ పికింగ్, సర్‌ఫేస్ స్లావోనియా అనే కోడ్ నేమ్స్‌తో రానున్న ఈ ఫోన్‌లలో స్పెసిఫికేషన్స్ కూడా వేరువేరుగా ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్‌లలో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌లను వినియోగించే అవకాశం ఉందట. మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ మొబైల్స్ సర్‌ఫేస్ పెన్ సపోర్ట్‌తో కూడా వస్తాయని తెలుస్తోంది.

ప్రొజెక్టర్‌లా ఉపయోగించుకునే అవకాశం..
మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌లను ప్రొజెక్టర్‌లా ఉపయోగించుకునేందకుగాను ‘ఆన్-టేబుల్' ప్రొజెక్షన్ ఎబులిటీ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్‌లలో యాడ్ చేయనున్నట్లు సమాచారం. ప్రముఖ డిజైనర్ బార్ట్లోమిజ్ టార్నోస్కి మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌కు సంబంధించి ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు.

ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే మైక్రోసాఫ్ట్..
మొబైల్ ఆపరేటింగ్ సిస్టంల విభాగంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్‌ల తమ తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇంకా అనౌన్స్‌మెంట్స్‌తో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌లు మార్కెట్ బ్లాక్‌బస్టర్‌లుగా నిలుస్తుండగా విండోస్ మొబైల్ ఫోన్‌లు మాత్రం ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications