'ఐఫోన్ 4ఎస్' రాక మార్కెట్లో ఓ సంచలనం..

By Super
|
 iPhone 4S
లండన్‌: యాపిల్ సహా వ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ మరణించడానికి మరణించడానికి కొద్ది గంటల ముందు ప్రపంచ మార్కెట్లోకి విడుదలైన యాపిల్‌ ఐఫోన్‌-4 ఎస్‌ అమ్మకాల్లో విజయపథంలో దూసుకుపోతోంది. ఐఫోన్ 4ఎస్‌ని కొనుగోలు చేసేందుకు జనాభా స్టోర్స్ దగ్గర క్యూలు కడుతున్నారు. క్యూలు ఎలా కడుతున్నారంటే గతంలో వారి వద్దనున్న స్మార్ట్ ఫోన్స్‌ని వెనక్కు ఇచ్చి మరీ కొత్త ఐఫోన్ 4ఎస్‌ని సొంతం చేసుకునేందుకు సిద్దమవుతున్నారు.

ఇటీవల కాలంలో ప్రముఖ సర్వే సంస్ద రాయ్‌టర్స్‌ విడుదల చేసిన సర్వే ప్రకారం అటు టోక్యో నుంచి ఇటు శాన్‌ఫ్రాన్సిస్కో వరకూ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న ప్రతి నలుగురిలో ఒకరు తమ ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకొవడానికి ఇష్టపడుతున్నారు. దీంతో బ్లాక్ బెర్రీ ఫోన్లకు గండిపడుతుంది. యుఎస్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ తదితర దేశాల్లో రాయ్‌టర్స్‌ సర్వే నిర్వహించింది. 'నేను ఇంతకుముందు వరకూ నోకియాను వాడాను. ఆ ఫోన్‌ వాడేటప్పుడు అది పూర్తిగా నా అవసరాలు తీర్చలేకపోతోంది అని అనిపిస్తుండేది. దీనికితోడు నా మిత్రులంతా యాపిల్‌ మొబైల్ ఫోన్లనే వాడుతున్నారు. దీంతో నేనూ యాపిల్‌కు మారా' అని సిడ్నీలో ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు వచ్చిన 25 యేళ్ళ మైల్స్‌ గీజ్లర్‌ వ్యాఖ్యానించారు.

ఇక యాపిల్‌ ఐఫోన్‌ విడుదలైన రోజునే 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్మకాలు జరుపుకున్నాయి. వారం రోజుల క్రితం ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చినప్పుడు మొత్తం 40 లక్షల యూనిట్లకు ఆర్డర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు దేశాల్లో శుక్రవారం స్టోర్స్‌లలో ఐఫోన్‌ 4ఎస్‌ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐఫోన్‌ శ్రేణిలోని ఫోన్లకు ఒక్క గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లు మాత్రమే పోటీని ఇచ్చేలా కనిపిస్తున్నాయి. యాపిల్‌తో పోటీ పడడంలో తన అశక్తతను అర్ధం చేసుకున్న నోకియా ఇప్పటికే పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను వదిలి మైక్రోసాఫ్ట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొత్త ఐఫోన్‌ చూడటానికి అంతకుముందు విడుదలైన ఐఫోన్‌లానే కనిపించినా, వేగవంతమైన ప్రాసెసర్‌, అధిక మెగాపిక్సల్‌ కెపాసిటీ గల కెమెరా, సిరి పేరిట సరికొత్త వాయిస్‌ యాక్టివేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ వంటి సదుపాయాలు దీన్ని మరింత ఆకర్షణీయం చేశాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X