ఒకేసారి 20 యాప్స్, తక్కువ ధరలో హైక్వాలిటీ ఫోన్ ఇదే!

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. గుడ్ క్వాలిటీ కెమెరా, డీసెంట్ డిజైనింగ్, క్రిస్ప్ డిస్‌ప్లేతో పాటు మన్నికైన హార్డ్‌వేర్ స్పెక్స్‌తో వస్తోన్న ఫోన్‌లు రూ.15,000 రేంజ్‌లో మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అటువంటి ఫోన్‌ల జాబితాలో హానర్ 6ఎక్స్ ఫోన్ ముందు వరసలో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర పరిధిలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంఫర్టబుల్ ఫీల్‌

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి హానర్ 6ఎక్స్ స్మార్ట్‌ఫోన్ మెటల్ క్రాఫ్ట్ బాడీతో ప్రీమియమ్ లుక్‌ను సంతరించుకుని ఉంది. కర్వుడ్ మెటల్ బ్యాక్ అలానే రౌండెడ్ కార్నర్స్ కంఫర్టబుల్ ఫీల్‌ను చేరువ‌చేస్తాయి. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్-లెన్స్ సెటప్ అలానే స్మార్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌లు స్టైలిష్‌గా అనిపిస్తాయి.

డ్యుయల్ కెమెరా సెటప్

కెమెరా విషయానికి వచ్చేసరికి హానర్ 6ఎక్స్ ఫోన్‌కు డ్యుయల్ కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా DSLR తరహాలో రియల్ టైమ్ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఫేస్‌ డిటెక్షన్ ఆటో ఫోకస్, ప్రో కెమెరా, ప్రో వీడియో, స్లో మోషన్, HDR, టైమ్ ల్యాప్స్, బ్యాక్ గ్రౌండ్ బ్లర్ వంటి ప్రత్యేకతమైన ఫీచర్లు హానర్ 6ఎక్స్ కెమెరాలో ఉన్నాయి.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి హానర్ 6ఎక్స్ ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 2.5డి కర్వుడ్ గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. హైడెఫినిషన్ వ్యూవింగ్ యాంగిల్స్ ఆకట్టుకుంటాయి.

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి

హానర్ 6ఎక్స్ ఫోన్ Android 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన హువావే కస్టమ్ స్కిన్ EMUI 4.1 యూజర్ ఇంటర్ ఫేస్ పై రన్ అవుతుంది. ఈ యూజర్ ఫేస్‌లో పొందుపరిచిన యానిమేషన్స్ అలానే స్టాక్ ఐకాన్స్, అప్లికేషన్స్ ఆకట్టుకుంటాయి.

 

సెక్యూరిటీకి పెద్దపీట

సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి హానర్ 6ఎక్స్ ఫోన్ శక్తివంతమైన బయోమెట్రిక్ సెన్సార్ సపోర్ట్‌తో వస్తోంది. ఇదే సమయంలో ఈ సెన్సార్‌ను అనేక పనులకు ఉపయోగించుకోవచ్చు.

రియల్ - లైఫ్ పెర్మామెన్స్ విషయానికి వచ్చేసరికి

 హానర్ 6ఎక్స్ ఫోన్ హువావే సొంతంగా తయారు చేసుకున్న Kirin 655 చిప్‌సెట్‌తో వస్తోంది. ఈ చిప్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన ఆక్టా కోర్ ప్రాసెసర్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌కు ఉపకరిస్తుంది. 3జీబి అలానే 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. హానర్ 6ఎక్స్ ఫోన్‌లో ఒకేసారి 20 అప్లికేషన్‌లను సమర్ధవంతంగా రన్ చేసుకోవచ్చు.

హై-గ్రాఫికల్ గేమ్స్ ఆడుకోవచ్చు..

కాంటాక్ట్ కిల్లర్ స్నైపర్, మార్వెట్ కాంటెస్ట్ ఆఫ్ ఛాంపియన్స్, Asphalt 8, డెత్ రేస్ వంటి హై-గ్రాఫికల్ 3డీ గేమ్స్‌ను హానర్ 6ఎక్స్ ఫోన్ సునాయాశంగా హ్యాండిల్ చేయగలదు. ఈ గేమ్స్ ఆడుతున్న సమయంలో ఫ్రేమ్స్ డ్రాప్ అవటం, ఫోన్ పనితీరు నెమ్మదించటం, బ్యాటరీ హీటెక్కటం వంటి సమస్యలు కనిపించవు.

తక్కువ ధరలో హైక్వాలిటీ ఫోన్

రోజువారి స్మార్ట్ మొబైలింగ్ అవసరాలను తీర్చటంతో హానర్ 6ఎక్స్ ఫోన్ పూర్తిస్ధాయిలో విజయం సాధించిందనటంలో ఎటువంటి సందేహం లేదు. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. హానర్ 6ఎక్స్ ఫోన్ జనవరి 24,2017 నుంచి Amazon.inలో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Swag Phone Honor 6X is the most sought after Android smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot