రూ. 2 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్, ఆ యూజర్లకి మరో బంపరాఫర్

Written By:

దేశీయ మొబైల్ తయారీ దిగ్గజం స్వైప్ టెక్నాలజీస్ బడ్జెట్‌ ధరలో ఎలైట్ డ్యుయల్‌ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేసింది. డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ ధరను కంపెనీ కేవలం రూ.3,999గా నిర్ణయించింది. అయితే దీన్ని మీరు రూ. 2 వేలకే సొంతం చేసుకునే అవకాశాన్ని జియో కల్పిస్తోంది. ఈ ఫోన్‌ను కొన్న యూజర్లకు రూ.2200 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అంటే వినియోగదారులు 1,799 రూపాయలకే (రూ .3,999 - రూ .2,200) వద్ద ఫోన్ కొనుగోలు చేసే అవకాశం అన్నమాట. అయితే జియో కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందనేది గమనార్హం.

ఇండియాకి త్వరలో రానున్న దిగ్గజ స్మార్ట్‌ఫోన్లు ఇవే, లాంచ్ తేదీ, ఫీచర్లపై ఓ లుక్కేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోతో భాగస్వామ్యం..

జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న స్వైప్‌ టెక్నాలజీస్‌ జియో ఫుట్‌బాల్‌ఆఫర్‌ కింద జియో (పాత,కొత్త) ఈ ఆఫర్‌ అందిస్తోంది. బ్లాక్, వైట్, గోల్డ్ మూడు రంగుల్లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా షాప్‌క్లూస్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

స్వైప్ ఎలైట్ డ్యుయల్ ఫీచర్లు

5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.బ్లాక్, వైట్, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం.

జియో ఫుట్ బాల్ ఆఫర్..

దీంతో పాటు చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు ఐవూమీ తన ఐ1ఎస్ స్మార్ట్‌ఫోన్‌కు గాను యానివర్సరీ ఎడిషన్ వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.7,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. దీనిపై జియో ఫుట్ బాల్ ఆఫర్ కింద రూ.2200 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను వోచర్ల రూపంలో అందిస్తున్నది. దీంతో ఫోన్ ధర రూ.5,299 వినియోగదారులకు లభిస్తోంది.

ఐవూమీ ఐ1ఎస్ యానివర్సరీ ఎడిషన్ ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 640 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

జియో టీవీ యాప్‌ను వాడే కస్టమర్లకు..

ఇదిలా ఉంటే టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన జియో టీవీ యాప్‌ను వాడే కస్టమర్లకు 10జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిసింది. అది కూడా పలువురు ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ డేటా లభిస్తుందని సమాచారం. కనుక జియో టీవీ యాప్‌ను రెగ్యులర్‌గా వాడే వారు ఎవరైనా తమ జియో అకౌంట్‌లోకి ఒకసారి వెళ్లి చెక్‌ చేసుకుంటే ఉచిత డేటా వచ్చిందీ, రానిదీ సులభంగా తెలుసుకోవచ్చు.

 

ఈ నెల 27వ తేదీ వరకు గడువు..

ఇక ఈ డేటా లభించే యూజర్లు రోజువారీ డేటా లిమిట్ ప్లాన్‌ను వాడుతున్నట్లయితే ఆ లిమిట్ అయిపోగానే ఈ ఉచిత డేటాను వాడుకునేందుకు వీలుంటుంది. ఈ డేటాను వాడుకునేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు విధించినట్లు తెలిసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Swipe Elite Dual brings dual rear cameras, 3000mAh battery for Rs 3,999 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot