ఆఫర్ అంటే ఇది, రూ.8,999కే 4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్
మూడు రోజులే ఆఫర్. త్వరపడండి...
4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ కెపాసిటీతో స్వైప్ టెక్నాలజీస్ ఆఫర్ చేస్తున్న 'స్వైప్ ఎలైట్ మాక్స్' (Swipe Elite Max) స్మార్ట్‌ఫోన్ మరోసారి ధర తగ్గింపును అందుకుంది. అయితే, ఈ ఆఫర్ లిమిటెడ్ పిరియడ్ మాత్రమే...
Read More : జియో ప్రైమ్ ఉచితం.. అలా చేయండి, ఇలా తీసుకోండి

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.10,999
డిసెంబర్, 2016లో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను తొలత రూ.10,999 ధర ట్యాగ్‌తో విక్రయించారు. ఆ తరువాత రూ.1000 తగ్గింపును తగ్గించారు.

లిమిటెడ్ పిరియడ్ ప్రైస్‌కట్ ఆఫర్‌లో రూ.8,999కే
తాజాగా అనౌన్స్ చేసిన లిమిటెడ్ పిరియడ్ ప్రైస్‌కట్ ఆఫర్‌లో భాగంగా మార్చి 22, 23, 24 తేదీల్లో స్వైప్ ఎలైట్ మాక్స్‌ను రూ.8,999కే విక్రయిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. Onyx బ్లాక్ వేరియంట్ లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

స్వైప్ ఎలైట్ మాక్స్ స్పెసిఫికేషన్స్
గ్లాస్ బాడీ విత్ జింక్ అల్యుమినియమ్ అలాయ్ బీజిల్, 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ ఆక్టా-కోర్ 64 బిట్ ప్రాసెసర్,

స్వైప్ ఎలైట్ మాక్స్ స్పెసిఫికేషన్స్
4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ జిప్ ఛార్జ్ ఫీచర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్), స్టీరియో మాక్స్ స్పీకర్.


Click it and Unblock the Notifications








