3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్.. ఫోన్ ధర మాత్రం రూ.7,000లోపే

స్వైప్ టెక్నాలజీస్ నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. ఇలైట్ సెన్స్ పేరుతో రాబోతున్న ఈ ఫోన్ మార్కెట్లో సంచలనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్‌ను రూ.7000కంటే తక్కువ ధరకే విక్రయించునున్నట్లు సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభ్యమయ్యే ఈ ఎక్స్‌క్లూజివ్ ఫోన్‌ను మార్చి మొదటి వారంలో లాంచ్ చేయనున్నారు.

3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్.. ఫోన్ ధర మాత్రం రూ.7,000లోపే

Swipe Elite Sense ప్రధాన స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్.. ఫోన్ ధర మాత్రం రూ.7,000లోపే

స్వైప్ టెక్నాలజీ కొద్ది రోజుల క్రితమైన స్వైప్ ఎలైట్ 3 పేరుతో సరికొత్త ఫోన్‌ని రిలీజ్ చేసింది. 4జీ వోల్ట్ సపోర్ట్ తో వస్తున్న ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 5,499గా నిర్ణయించింది. బుధవారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి...

3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్.. ఫోన్ ధర మాత్రం రూ.7,000లోపే

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో విత్ Indus OS మీద ఫోన్ ఆపరేట్ అవుతుంది. డ్యూయెల్ సిమ్‌తో వచ్చిన ఈ ఫోన్ 5 ఇంచ్ హెచ్‌డి ఐపీఎస్ డిస్‌ప్లే 720x1280 రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 1.3GHz క్వాడ్ కోర్ స్ప్రెడ్ ట్రమ్ SC9832 processor మీద రన్ అవుతుంది. 2 జిబి ర్యామ్ అలాగే 16 జిబి ఇంటర్నల్ మెమొరీ మైక్రోఎస్డీ ద్వారా 32 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం ఉంది. కెమెరా విషయానికొస్తే 8 ఎంపీ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌తో పాటు 5 ఎంపీ సెల్పీ షూటర్ కూడా ఉంది. బ్యాటరీ విషయానికొస్తే 2500mAh. బరువు 172.5 గ్రాములు. వైఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో అదనపు ఫీచర్లు.

English summary
Swipe Elite Sense with Qualcomm Snapdragon 425, 3GB RAM and 13MP rear camera to be launched. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot