రూ.2799కే 4G VoLTE స్మార్ట్‌ఫోన్
మొదటి 500 కస్టమర్‌లకు రూ.200 తగ్గింపు.
స్వైప్ టక్నాలజీస్ మరో తక్కువ ధర 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. స్వైప్ కనెక్ట్ 4జీ పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.2,799.

బ్లాక్ కలర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఫోన్‌ను ఈ-కామర్స్ వెబ్‌సైట్ షాప్‌క్లూస్ డిసెంబర్ 27 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. మొదటి 500 కస్టమర్‌లకు రూ.200 తగ్గింపును కూడా ఇవ్వనున్నట్లు సదురు వెబ్‌సైట్ పేర్కొంది.
4 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్క్రీన్ (రిసల్యూషన్ 1280 x 720 పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్, జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్, మైక్రో యూఎస్బీ పోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో) స్వైప్ టెక్నాలజీస్ తన Elite సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Swipe Elite Max పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఊరించే ప్రయత్నం చేస్తోంది. రూ.10,999 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉంచిన ఈ ఫోన్‌ను, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ డిసెంబర్ 14 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ ఆక్టా-కోర్ 64 బిట్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ జిప్ ఛార్జ్ ఫీచర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్), స్టీరియో మాక్స్ స్పీకర్.
స్వైప్ కనెక్ట్ 4జీ స్పెసిఫికేషన్స్

స్వైప్ కనెక్ట్ 4జీ స్పెసిఫికేషన్స్

రూ.10,999కే 4జీబి ర్యామ్ ఫోన్

Swipe Elite Max స్పెసిఫికేషన్స్

Swipe Elite Max స్పెసిఫికేషన్స్


Click it and Unblock the Notifications








