రూ.2,799కే స్వైప్ కనెక్ట్ గ్రాండ్

స్వైప్ టెక్నాలజీస్ తన కనెక్ట్ సిరీస్ నుంచి మరో చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. స్వైప్ కనెక్ట్ గ్రాండ్ పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.2,799.

రూ.2,799కే స్వైప్ కనెక్ట్ గ్రాండ్

Read More : నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో 5 ఆసక్తికర ఫీచర్లు

Shopclues ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి 500 కస్టమర్‌లకు రూ.200 తగ్గింపును కూడా ఇవ్వనున్నట్లు సదురు వెబ్‌సైట్ పేర్కొంది. ఈ ఫోన్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది అనేదాని పై స్పష్టమైన సమాచారం లేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్వైప్ కనెక్ట్ గ్రాండ్ స్పెసిఫికేషన్స్....

5 అంగుళాల డిస్‌ప్లే , ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.2GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2500mAh బ్యాటరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్).

జనవరి 19న రెడ్మీ నోట్ 4

స్వైప్ కనెక్ట్ 4జీ

గడిచిన నెలలోనే స్వైప్ టక్నాలజీస్ స్వైప్ కనెక్ట్ 4జీ పేరుతో మరో తక్కువ ధర 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.2,799. ఈ ఫోన్ కూడా Shopcluesలో లభ్యమవుతోంది.

స్వైప్ కనెక్ట్ 4జీ స్పెసిఫికేషన్స్

4 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్క్రీన్ (రిసల్యూషన్ 1280 x 720 పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌‍మల్లో ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

స్వైప్ కనెక్ట్ 4జీ స్పెసిఫికేషన్స్

5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్, జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్, మైక్రో యూఎస్బీ పోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Swipe Konnect Grand affordable smartphone launched at Rs 2,799. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot