రూ.2,999 ధరతో మరో 4G VoLTE స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
అదనంగా రూ.150 డిస్కౌంట్ కూడా...
స్వైప్ టెక్నాలజీస్ నుంచి మరో ఎంట్రీ లెవల్ 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. స్వైప్ కనెక్ట్ నియో 4జీ విడుదలైన ఈ ఫోన్ ధర రూ.2,999. Shopclues ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. కొనుగోల సమయంలో SWIPE150 అనే కూపన్ కోడ్‌ను వినియోగించుకోవటం ద్వారా రూ.150 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. బ్లాక్ కలర్ వేరియంట్‌లో మాత్రమే ఫోన్ అందుబాటులో ఉంటుంది.
Read More : 8జీబి ర్యామ్‌తో OnePlus 5

స్వైప్ కనెక్ట్ నియో 4జీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్.. 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.5GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, డ్యుయల్ సిమ్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2000mAh బ్యాటరీ.
Read More : లీకైన జియో సెట్ టాప్ బాక్స్ ఫోటోలు


Click it and Unblock the Notifications