టాటా డొకొమో 'ఫేస్‌బుక్' ఫోన్ అదుర్స్

Posted By: Staff

టాటా డొకొమో 'ఫేస్‌బుక్' ఫోన్ అదుర్స్

భారతదేశపు ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ టాటా డొకొమో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కొసం ప్రత్యేకంగా ఓ సరిక్రొత్త మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనుంది. ప్రస్తుత రోజుల్లో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్ ప్రజల జీవితాల్లో మమేకం అయిపోయింది. ముఖ్యంగా యవతను తీసుకున్నట్లైతే ఫేస్‌బుక్‌లో వారు చేసేటటువంటి హాల్ చల్ అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో నిర్వహించిన సర్వేలో యువత రోజులో 12 గంటలు ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తుంటే అందులో సుమారు 10 గంటలు ఫేస్‌బుక్‌లోనే ఎక్కవ సమయం గడుపుతున్నారని తెలిసింది.

దీనిని ఆధారం చేసుకొని టాటా డొకొమో కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ ఫోన్‌ని రూపొందించనుంది. టాటా డొకొమో అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఫేస్‌బుక్ ఫోన్‌ని రూ 2,500లకే మార్కెట్లోకి విడుదల చేయనున్నారని తెలిసింది. ఈ ఫేస్‌బుక్ ఫోన్‌ హువాయ్ కంపెనీ తయారు చేయనున్నట్లు మొబిలిటీ సర్వీసెస్ హెడ్ సునీల్ తెలిపాడు.

మార్కెట్లో చాలా ఫేస్‌బుక్ ఫోన్స్ ఉండగా, ఇప్పుడు టాటా డొకొమో విడుదల చేయనున్న ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటని అనుకుంటున్నారా.. ఈ మొబైల్‌లో కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ ఆప్షన్స్‌ని రూపొందించడమే కాకుండా, ఫ్రీగా వాయిస్ మినిట్స్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ ఫేస్‌బుక్ ఫోన్‌ గురించి ఖచ్చితంగా డిటేల్స్ కావాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ ఫేస్‌బుక్ ఫోన్‌‌లో ఫేస్‌బుక్ కొసం ప్రత్యేకంగా “F” అనే బటన్‌ని రూపొందించడం జరిగిందని తెలియజేశారు.

టాటా డొకొమో విడుదల చేయనున్న ఫేస్ బుక్ ఫోన్ ఫీచర్స్, ప్రత్యేకతలు ఈ విధంగా ఉండవచ్చునని భావించడం జరుగుతుంది. 2.4 ఇంచ్ డిస్ ప్లేతో పాటు, క్వర్టీ టైపు కీప్యాడ్ దీని సొంతం. మొబైల్ వెనుక భాగాన ఉన్న 2.0 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఇమేజిలను తీయవచ్చు. డేటా ట్రాన్ఫర్ కోసం బ్లూటూత్, పాటలు వినేందుకు గాను ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. ఇక ఎంటర్టెన్మెంట్ విషయనికి వస్తే ఇందులో ఆడియో, వీడియో ప్లేయర్స్‌ని కూడా పొందుపరచడం జరిగిందని సమాచారం.

ఇక టాటాడొకొమో భారతీయుల కొసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ ఫేస్‌బుక్ ఫోన్ ఖరీదు కూడా సమాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటుందని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot