ఆంధ్రా మొబైల్ యూజర్లకు టాటా డొకోమో ‘ఫ్రీడమ్ ఆఫర్’

|

టాటా టెలీసర్వీసెస్‌లో భాగంగా టెలికామ్ సేవలను అందిస్తున్న టాటా డొకోమో స్వాత్రంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కోసం ఫ్రీడమ్ (Freedom) ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా రూ.32 రీఛార్జ్ పై 2జీ ప్రీ-పెయిడ్ వినియోగదారులు 1947ఎంబీతో కూడిన 2జీబి డేటాను పొందవచ్చు.

 
ఆంధ్రా మొబైల్ యూజర్లకు టాటా డొకోమో ‘ఫ్రీడమ్ ఆఫర్’

ఇప్పటి వరకు రూ.32 రీఛార్జ్ పై టాటా డొకోమో 600 ఎంబీ డేటాను ఆఫర్ చేస్తూ వస్తోంది. టాటా డొకోమో ప్రవేశపెట్టిన ఫ్రీడమ్ ప్యాక్ వ్యాలిడిటీ 7 రోజులు. అగష్టు 31 వరకు ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు టాటా డొకోమో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్. రామకిృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. తక్కిన మొబైల్ ఆపరేటర్లు స్వాత్రంత్ర్యదినోత్సవ ఆఫర్‌లను ప్రకటించాల్సి ఉంది.

భారతీయులు ఈ 67వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సగర్వంగా జరపుకుంటున్న నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ ద్విభాషా పోర్టల్ వన్‌ఇండియా మరో ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఇండియావీడియోతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుని భారతీయ సంస్కృతి ఇంకా సాంప్రదాయలతో పాటు జాతి విశిష్టతను నేటి యువతరానికి పరిచయం చేసే క్రమంలో 7,000 వీడియోలను ఒకేచోట ఉచితంగా వీక్షించేసదుపాయాన్ని నెటిజనులకు ఈ అగష్టు 15 కానుకుగా కల్పించటం జరుగుతోంది. మన త్రివర్ణ పతాకాన్ని ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపొందించటం తెలుగువారిగా మనకెంతో గర్వకారణం. మన జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగలు సమ నిష్ఫత్తిలో ఉంటాయి. తెలుపు రంగుకు మధ్యలో 24 ఆకులు గల అశోకుడి ధర్మచక్రం ఉంటుంది. వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సౌఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.

ఉచిత వీడియోలను తిలకించటం ఏలా..? ప్రముఖ ఆన్‌లైన్ ద్విభాషా పోర్టల్ వన్ ఇండియా మరో ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఇండియావీడియో 67వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రత్యేకంగా అందిస్తున్న ఉచిత వీడియోలను తిలకించేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. సదరు లింక్ పై క్లిక్ చేసి సంబంధిత వెబ్ పేజీలోకి ప్రవేశించిన తరువాత పేజీని క్రిందకి స్ర్కోల్ చేసినట్లయితే మన జాతీయ జెండాతో కూడిన ఫోటో కనిపిస్తుంది. కర్సర్‌ను ఆ ఫోటో పై ఎక్కడ ప్లేస్ చేసినా ఓ వీడియో పాప్‌అప్ మీకు కనబడుతుంది. ఆ పాప్‌అప్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి సమాచారంతో వీడియో ప్లే అవతుంది. మొత్తం 7,000 వీడియోలను ఈ ఫోటోలో పొందుపరచటం జరిగింది. ఈ వీడియోలను మీ మిత్రులతో పంచుకునే అవకాశాన్ని వన్ ఇండియా కల్పిస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X