టాటా డొకోమో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్!!

Posted By:

మొబైల్ యూజర్‌లకు మరింత చేరువయ్యే క్రమంలో ప్రముఖ టెలికం ఆపరేటర్లు డజన్ల కొద్ది కొత్త టారిఫ్ ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. కళాశాల విద్యార్థుల కోసం వొడాఫోన్  క్యాంపస్ ప్యాక్‌తో ముందుకు రాగా, ఎంటీఎస్ రూ.199కే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. మరో వైపు రిలయన్స్ తన ఇంటర్నెట్ యూజర్ల కోసం డేటా ప్లాన్‌ల పై ధర తగ్గింపును ప్రకటించింది.

రామ్‌చరణ్ బ్రాండ్ డబల్ ధమాకా!

తాజాగా, హీరో రామ్‌చరణ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న టెలికం బ్రాండ్ టాటా డొకోమో తన సీడీఎమ్ఏ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ఉత్సాహకరమైన అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా టాటా డొకోమో పోస్ట్‌పెయిడ్ వినియోగదారుడు రూ.1299 చెల్లించినట్లయితే నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా లోకల్ ఇంకా ఎస్‌టీడీ కాల్స్‌ను నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. వినియోగదారుడు ఈ ఆఫర్‌లో భాగంగా 3జీబి ఇంటర్నెట్ డేటాతో పాటు 3000 సందేశాలను ఉచితంగా పంపుకోవచ్చు. నెలరోజుల లోపే 3000 సందేశాల వినియోగం పూర్తి అయినట్లయితే తరువాత పంపే లోకల్ సందేశానికి రూ.1, నేషనల్ సందేశానికి రూ.1.50, అంతర్జాతీయ సందేశాలకు రూ.5 చొప్పున వసూలు చేస్తారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot