కొత్త ఫోన్‌లు ఇస్తాం: టాటా డొకొమో

Posted By:

దేశంలోనే తొలిసారిగా ఓ వినూత్న పథకానికి ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ టాటా డొకొమో శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని తమ పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ‘సింప్లీ స్వాప్' పేరుతో సరికొత్త స్కీమ్‌ను టాటా డొకొమో ప్రారంభించింది. ఈ పథకాన్ని రిజిస్టర్ చేసుకున్న టాటా డొకొమో వినియోగదారులు తమ ఫోన్ పాడైనా లేదా మార్చుకోవాలనుకున్నా కొంత రుసుము చెల్లించి కొత్త ఫోన్‌ను పొందవచ్చని టాటా టెలీ సర్వీసెస్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ హెడ్ అభిజిత్ కిషోర్ గురువారం ఒక మీడియా ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 30 బ్రాండ్‌లకు చెందిన 500లకు పైగా ఫోన్ మోడళ్లకు ఈ పథకం వర్తిస్తుందని అభిజిత్ వెల్లడించారు.

కొత్త ఫోన్‌లు ఇస్తాం: టాటా డొకొమో

సింప్లీ స్వాప్ పథకం నిబంధనలు

ఈ పథకంలో రిజిస్టర్ కావాలనుకుంటున్న టాటా డొకొమో పోస్ట్ పెయిడ్ చందాదారులు తమ ఫోన్ కొన్న తేదీ నుంచి 90 రోజులలోపే తమ పేరును నమోదు చేసుకోవల్సి ఉంటుంది. సింప్లీ స్వాప్ పథకంలో తమ పేరును నమోదు చేసుకోవల్సిన వారు డయల్ చేయవల్సిన నెంబరు 040-66066141. పథకం కాలపరిమితి 12 నెలలు. ఏడాదిలో రెండు సార్లు మాత్రమే ఫోన్ మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. వినియోగదారుడి వద్ద ఉన్న ఫోన్ ఖరీదును బట్టి నెలవారీ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ ధర రూ.5,000లోపు ఉంటే రూ.89 చెల్లించాల్సి ఉంటుంది. ఖరీదైన ఫోన్ అయితే రూ.669 నెలవారీ చార్జీ ఉంటుంది. చెల్లించవల్సిన వాయిదా రుసుమును నెలవారీ ఫోన్ బిల్లులో కలుపుతారు.

ఫోన్ మార్చుకునే సమయంలో ఫోన్ మోడల్‌ను బట్టి ముందస్తు రుసుము క్రింద రూ.500 నుంచి రూ.5,800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. హ్యాండ్‌సెట్‌ను మార్చుకోవాలనే వారిని టాటా డొకొమో ప్రతినిధులు సంప్రదించి వారి వద్ద ఉన్న ఫోన్ ఏ స్థితిలో ఉన్నప్పటికి తీసుకుని అలాంటి హ్యాండ్‌సెట్‌నే 72 గంటల్లోపు ఇస్తారు. భవిష్యత్‌లో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని ఇతర ప్రాంతాలకు, ఆ తరువాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లలో ప్రవేశపెట్టనున్నట్లు అభిజిత్ కిషోర్ తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Tata Docomo offers to replace your damaged phone. Read more in Read more in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot