కంప్యూటర్‌లోనూ టాటా స్కై ప్రసారాలు

Posted By:

స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ వంటి కమ్యూనికేషన్ సాధనాల్లో టాటా స్కై ప్రసారాలను వీక్షించేందుకు అనువుగా రూపకల్పన చేయబడిన ఎవ్రీవేర్ టీవీ అప్లికేషన్‌ను ఇప్పుడు డెస్క్‌టాప్ కంప్యూటర్ ఇంకా ల్యాప్‌టాప్‌లకూ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దేశంలోని ప్రముఖ డైరెక్ట్ - టూ- హోమ్ టెలివిజన్ ఆపరేటర్ టాటా స్కై (Tata Sky)ఒక ప్రకటనలో తెలిపింది.

కంప్యూటర్‌లోనూ టాటా స్కై ప్రసారాలు

ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వినియోదారులు అదనపు ఖర్చు లేకుండా ఫిఫా వరల్డ్ కప్ 2014 ప్రత్యక్ష ప్రసారాలను సోనీ సిక్స్ చానల్ ద్వారా తిలకించవచ్చని టాటాస్కై వెల్లడించింది. ఈ అప్లికేషన్ ఇప్పటికే ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్‌ను ఆయా ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేసే డివైజ్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా టాటా స్కై ప్రసారాలను అంతరాయం లేకుండా వీక్షించవచ్చు.

భారత కాలమానం ప్రకారం ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు ప్రతిరోజు అర్థరాత్రి ఉంటున్నందున ఔత్సాహికులు తమ కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా ఎవ్రీవేర్ టీపీ అప్లికేషన్‌ను ల్యాప్‌టాప్‌లలో నిక్షిప్తం చేసుకుని ఈ పోటీలను వీక్షించవచ్చని సంస్థ తెలిపింది. టాటా స్కై ఖాతాదారులు ఈ అప్లికేషన్‌ను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot