Home
Mobile

CES 2020: TCL ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి...

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ TCL (టిసిఎల్) ఎట్టకేలకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. 2020 సంవత్సరం ప్రారంభంలో జనవరి7న లాస్ వెగాస్ లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES ) 2020 లో TCL కంపెనీ తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లైన్ గురించి వివరాలను రివీల్ చేసింది.

TCL

TCL కంపెనీ రివీల్‌ చేసిన వివరాలలో భాగంగా టిసిఎల్ 10 ప్రో, టిసిఎల్ 10 5G, టిసిఎల్ 10L లైనప్‌ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లతో పాటు కంపెనీ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఫీచర్స్ కూడా రివీల్ చేసింది. మూడు సార్లు ఫోల్డ్ చేయగల ఈ స్మార్ట్‌ఫోన్ గురించి అన్ని వివరాలను టిసిఎల్ సంస్థ CES 2020 ఈవెంట్ లో పంచుకున్నది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుంది అని వివరించారు. TCL క్రొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ యొక్క డిజైన్ మరియు ప్రత్యేకతల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

TCL ఫోల్డబుల్ ఫోన్ వివరాలు

TCL ఫోల్డబుల్ ఫోన్ వివరాలు

CES 2020 ఈవెంట్ లో ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఫోన్ యొక్క డిస్ప్లే 7.2-అంగుళాల పరిమాణంలో ఉండి అది ప్లాస్టిక్‌తో తయారు చేయబడి ఉంటుంది. అలాగే ఇందులో ప్లాస్టిక్ బెజల్స్ నిర్మాణం కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఏ దశలోనైనా ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉంటుంది అని నివేదిక పేర్కొంది.

 

 

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

ఇతర ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ఓపెన్‌గా ఉండటానికి బదులుగా స్నాప్ ఓపెన్ లేదా స్నాప్ క్లోజ్ చేస్తాయి. కానీ TCL ఫోల్డబుల్ ఫోన్ ఈ రెండు ధోరణులను కూడా సహజ పద్ధతిలో ఉపయోగిస్తుంది. వాస్తవానికి వినియోగదారుడు ఏదైనా టైప్ చేయడానికి ఫోల్డ్ చేసిన రెండవ సగం కూడా ఉపయోగపడుతుంది అని తెలిపారు. TCL ఫోల్డబుల్ ఫోన్ కు సంబంధించి మరికొన్ని స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ తెలిపింది. ఇందులో క్వాడ్-కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ మరియు 5G సపోర్ట్ కూడా ఉన్నాయి.

 

 

 

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఈ TCL ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో గల కెమెరా సెటప్ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రైమరీ, సూపర్-వైడ్-యాంగిల్, మాక్రో-లెన్స్ మరియు లౌ-లైట్ సెన్సార్‌లను కలిగిన కెమెరాలతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి టిసిఎల్ స్నాప్‌డ్రాగన్ 765 లేదా స్నాప్‌డ్రాగన్ 765G SOCతో వచ్చే అవకాశం ఉంది. ఇటీవల విడుదల చేసిన మోటరోలా రేజర్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కంటే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ చౌకగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

 

 

ఫీచర్స్

ఫీచర్స్

భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఈ స్మార్ట్‌ఫోన్ పేర్కొంది. మార్కెట్లో అనేక మంది స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ప్రస్తుతం తమ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లపై పనిచేస్తున్నారు. శామ్‌సంగ్, మోటరోలా వంటి సంస్థలు ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసాయి. ప్రస్తుతానికి మార్కెట్‌లో ఉన్న అన్ని రకాల ఫోల్డబుల్ ఫోన్‌లకు TCL ఫోన్ గట్టి పోటీని ఇస్తుంది అని సంస్థ ప్రకటించింది. దీని యొక్క ధర యొక్క వివరాలు వెల్లడించలేదు లేదు కానీ మార్కెట్‌లో ప్రస్తుతం అనుదుబాటులో ఉన్న అన్నిటికంటే తక్కువ ధరను కలిగి ఉంటుంది అని తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
TCL Foldable Phone Features Reveals at CES 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X