హాంగ్‌కాంగ్ ప్రధాన కేంద్రంగా అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్‌లను అందిస్తున్న టెక్‌బెర్రీ సంస్థ నూతనంగా దేశీయ మార్కెట్లోకి 'రిస్ట్ వాచ్ మొబైల్ ఫోన్'ను విడుదల చేసింది. చెన్నరు లో ఏర్పాటుచేసిన సమావేశంలో టెక్‌బెర్రీ ఇండియా సిఈఓ జాన్ యేసుదాస్ మాట్లా డుతూ టిబి 007 పేరుతో అందిస్తున్న ఈ సెల్‌ఫోన్ వినియోగదారులను మరింత ఆకర్షి స్తుందని పేర్కొన్నారు. సాధారణ సెల్‌ఫోన్ లాగే ఇందులో కూడా జిపిఆర్‌ఎస్, ఎఫ్‌ఎం, 1.2 మెగా ఫిక్సల్ కెమోరా, బ్లూటూత్ వంటివి వుంటాయన్నారు. 500 నెంబర్లు, కాల్స్ రికార్డ్ చేసుకొనే సామర్ధ్యం కలిగివుంటుందన్నారు.