భార‌త్‌లో Tecno Camon 19 Pro 5G విడుద‌ల అప్పుడేనా.. ధ‌ర ఎంతంటే!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ టెక్నో.. భార‌త్ మార్కెట్లో త‌మ‌ Tecno Camon 19 Pro 5G మొబైల్‌ను విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆగ‌స్టు 10వ తేదీన Tecno Camon 19 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కంపెనీ త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

 
భార‌త్‌లో Tecno Camon 19 Pro 5G విడుద‌ల అప్పుడేనా.. ధ‌ర ఎంతంటే!

ఇప్ప‌టికే గ‌త జూన్‌లో ఈ Tecno Camon 19 Pro 5G మొబైల్‌ను కంపెనీ ప‌లు ఎంపిక చేసిన మార్కెట్ల‌లో విడుద‌ల చేసింది. ఇది MediaTek Dimensity 810 SoC ప్రాసెస‌ర్‌తో రానుంది. అంతేకాకుండా అప్‌గ్రేడెడ్ కెమెరా ఫీచ‌ర్లు, మ‌రియు 5,000mAh బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో రానుంది. విడుద‌ల‌కు ముందు ప‌లు సోష‌ల్ మీడియా వేదిక‌ల ద్వారా కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించి స్పెసిఫికేష‌న్ల‌ను టీజ్ చేస్తోంది.

Tecno Camon 19 Pro 5G ఎక్స్‌పెక్టెడ్‌ స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.8 అంగుళాల (1,080x2,460 pixels) రిసొల్యూష‌న్‌తో full-HD డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 810 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ర‌న్ అవుతుంది. ఇక ర్యామ్ విష‌యానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌కు 8GB of RAM+256GB అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

భార‌త్‌లో Tecno Camon 19 Pro 5G విడుద‌ల అప్పుడేనా.. ధ‌ర ఎంతంటే!

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన కెమెరా 64-మెగాపిక్సెల్ క్వాలిటీలో RGBW+G+P 1/1.6 అప‌ర్చ‌ర్ లెన్స్ ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. ఇక మిగ‌తా రెండు కెమెరాలు 2 మెగాపిక్సెల్ క్వాలిటీతో మాక్రో షాట్స్ లెన్స్ ఇస్తున్నారు. ఇక వీడియో కాలింగ్ సెల్ఫీ విష‌యానికొస్తే.. 16 మెగాపిక్సెల్ క్వాలిటీ గ‌ల లెన్స్ ఫ్రంట్ క్యాం కు ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. ఇది బ్లాక్‌, గ్రీన్ క‌ల‌ర్ వేరియంట్ల‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు ఓ నివేదిక వెల్ల‌డించింది

Tecno Camon 19 Pro 5G ధ‌ర‌లు:
ఈ మొబైల్స్ భార‌త మార్కెట్లో ఆగ‌స్టు 10వ తేదీన విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు టెక్నో కంపెనీ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. జూన్‌లో ఇది గ్లోబ‌ల్‌గా ప‌లు ఎంపిక చేయ‌బ‌డిన మార్కెట్ల‌లో విడుద‌ల కాగా.. 8GB of RAM+256GB వేరియంట్ ధ‌ర‌ను 320 డాల‌ర్లుగా నిర్ణ‌యించారు. భార‌త క‌రెన్సీ ప్ర‌కారం.. దాదాపు రూ.25 వేలు ఉండొచ్చ‌ని భావిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, టెక్నో కంపెనీ ఇటీవ‌ల భార‌త మార్కెట్లో విడుద‌లైన Tecno Spark 9T బ‌డ్జెట్ మొబైల్స్ సేల్స్ ఆగ‌స్టు 6వ తేదీన ప్రారంభ‌మ‌య్యాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం.
Tecno Spark 9T మొబైల్ గ‌త నెల ఆఖ‌ర్లో భార‌త మార్కెట్లో విడుద‌ల కాగా, ఆగ‌స్టు 6వ తేదీ నుంచి భార‌త్‌లో వీటి సేల్స్ ప్రారంభ‌మ‌య్యాయి. అమెజాన్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతం వాటి ధ‌ర, స్పెసిఫికేష‌న్ల గురించి మ‌రోసారి వివ‌రంగా తెలుసుకుందాం.

 
భార‌త్‌లో Tecno Camon 19 Pro 5G విడుద‌ల అప్పుడేనా.. ధ‌ర ఎంతంటే!

Tecno Spark 9T ధ‌ర‌లు:
భార‌త మార్కెట్లో ఈ Tecno Spark 9T మొబైల్ జులై 28వ తేదీన విడుద‌లైంది. భార‌త్‌లో మార్కెట్లో ఈ మొబైల్ 4GB RAM + 64GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.9,299 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు భార‌త మార్కెట్‌లో వినియోగ‌దారుల‌కు ఇది అట్లాంటిక్ బ్లూ, టాహితి గోల్డ్‌, ఐరిస్ ప‌ర్పుల్ క‌ల‌ర్ల‌లో వినియోగ‌దారుల‌కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా, ఈ Tecno Spark 9 మొబైల్స్ విక్ర‌యాన్ని ఆగస్టు 6 న ఉదయం 12 గంటలకు అమెజాన్ ద్వారా కంపెనీ ప్రారంభించింది. కొనుగోళ్లు చేయడానికి SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే కొనుగోలుదారులకు 10 శాతం తగ్గింపు అందించబడుతుంది. అంతేకాకుండా, అమెజాన్‌లో Tecno Spark 9T క్విజ్ ద్వారా కూడా అమెజాన్‌పే కొనుగోలుదారుల‌కు రూ.500 డిస్కౌంట్ ల‌భించ‌నుంది.

Tecno Spark 9T ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల (1,080x2,408 pixels) రిసొల్యూష‌న్‌తో full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ MediaTek Helio G35 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ HiOS 7.6 ఆధారిత ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ 4GB of LPDDR4x RAM కెపాసిటీ తో, మెరుగైన ప‌ని తీరును క‌న‌బ‌రుస్తుంది. దీనికి 4GB of LPDDR4x RAM| 64GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ అందిస్తున్నారు.

ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రొక‌టి 2 మెగాపిక్సెల్ క్వాలిటీలో పోర్ట్ర‌యిట్ లెన్స్‌, ఏఐ సెన్సార్‌ ఇస్తున్నారు. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, కొత్త Tecno Spark 9T వేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, NFC క‌నెక్టివిటీల‌ను క‌లిగి ఉంది.

Best Mobiles in India

English summary
Tecno Camon 19 Pro 5G India Launch Date Set for August 10, Specifications Teased

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X