Home
Mobile

Tecno నుంచి 5,000mAh సామ‌ర్థ్యంలో మిడ్ రేంజ్ మొబైల్ విడుద‌ల‌!

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీ సంస్థ టెక్నో.. భార‌త మార్కెట్లో క్ర‌మంగా త‌మ ఉత్ప‌త్తుల్ని విస్త‌రింప‌జేస్తోంది. తాజాగా ఆ కంపెనీ భార‌త మార్కెట్‌కు మ‌రో కొత్త మొబైల్‌ను ప‌రిచ‌యం చేసింది. Tecno Camon 19 Pro 5G పేరుతో స‌రికొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధ‌వారం భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. ఈ మొబైల్ ప‌లు అప్‌గ్రేడెడ్ వ‌ర్ష‌న్ ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల ముందుకు వస్తోంది.

Tecno Camon 19 Pro 5G

దీనికి MediaTek Dimensity 810 SoC ప్రాసెస‌ర్‌ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ 6.8 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేటుతో వ‌స్తోంది. అంతేకాకుండా దీనికి 5,000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో ఫీచ‌ర్లు, స్పెసిఫికేషన్లు, ధ‌ర‌ల వివ‌రాల‌ను కూడా తెలుసుకుందాం.

భార‌త్‌లో Tecno Camon 19 Pro 5G ధ‌ర‌లు:

భార‌త్‌లో Tecno Camon 19 Pro 5G ధ‌ర‌లు:

భార‌త మార్కెట్లో Moto G32 మొబైల్స్ 8GB RAM + 128GB స్టోరేజీ ధ‌ర‌ను రూ.21,999 గా నిర్ణ‌యించారు. భార‌త మార్కెట్లో ఇవి సిడార్ గ్రీన్‌, ఎకో బ్లాక్‌ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. ఆగ‌స్టు 12వ తేదీ నుంచి ఇవి భార‌త్‌లో యూజ‌ర్ల‌కు కొనుగోలుకు అందుబాటులోకి వ‌స్తాయి. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ వేదిక‌గా ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Tecno Camon 19 Pro 5G స్పెసిఫికేష‌న్లు:

Tecno Camon 19 Pro 5G స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ కు 6.8 అంగుళాల (1,080x2,460 pixels) రిసొల్యూష‌న్‌తో full-HD+ LTPSడిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 810 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇది HiOS 8.6 ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ర‌న్ అవుతుంది. ఇక ర్యామ్ విష‌యానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌కు 8GB of LPDDR4x RAM+128GB అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన కెమెరా 64-మెగాపిక్సెల్ క్వాలిటీలో RGBW+ (G+P) లెన్స్ ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. మంచి ఫొటోగ్రాఫ్స్‌ను అందించ‌డం కోసం OIS అలాగే HISని ఉపయోగిస్తుంది. ఇక మిగ‌తా రెండు కెమెరాలు 2 మెగాపిక్సెల్ క్వాలిటీతో ఇస్తున్నారు. ఇక వీడియో కాలింగ్ సెల్ఫీ విష‌యానికొస్తే.. 16 మెగాపిక్సెల్ క్వాలిటీ గ‌ల f/2.45 అప‌ర్చ‌ర్ లెన్స్ ఫ్రంట్ క్యాం కు ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. క‌నెక్టివిటీ ప‌రంగా.. డ్యుయ‌ల్ బ్యాండ్ Wi-Fi, 4G LTE, బ్లూటూత్ v5.0, USB Type-C ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది.

Tecno Spark 9T ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Tecno Spark 9T ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ కు 6.6 అంగుళాల (1,080x2,408 pixels) రిసొల్యూష‌న్‌తో full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ MediaTek Helio G35 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ HiOS 7.6 ఆధారిత ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ 4GB of LPDDR4x RAM కెపాసిటీ తో, మెరుగైన ప‌ని తీరును క‌న‌బ‌రుస్తుంది. దీనికి 4GB of LPDDR4x RAM| 64GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ అందిస్తున్నారు.

ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రొక‌టి 2 మెగాపిక్సెల్ క్వాలిటీలో పోర్ట్ర‌యిట్ లెన్స్‌, ఏఐ సెన్సార్‌ ఇస్తున్నారు. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, కొత్త Tecno Spark 9T వేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, NFC క‌నెక్టివిటీల‌ను క‌లిగి ఉంది. ప్ర‌స్తుతం ఈ మొబైల్స్ రూ.9,299 కు అమెజాన్ వేదిక‌గా అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Tecno Camon 19 Pro 5G With 64-Megapixel Custom Sensor, Dimensity 810 SoC Launched in India: All Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X