Home
Mobile

108MP కెమెరా, 512GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.7000 వరకు తగ్గింపు.. అమెజాన్‌లో సేల్‌..!

టెక్నో నుంచి 2023 జులైలో టెక్నో కెమన్‌ 20 ప్రీమియర్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ (Tecno Camon 20 Premier 5G Smartphone pricedrop) లాంచ్ అయింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.29999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్‌లతో కలిపి రూ.17,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే భారీ తగ్గింపు ధరను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 108MP కెమెరా, 512GB అంతర్గత స్టోరేజీను కలిగి ఉంది. మరియు ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులో ఉంది.

టెక్నో కెమన్‌ 20 ప్రీమియర్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ డిస్కౌంట్ :
టెక్నో కెమన్‌ 20 ప్రీమియర్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ అమెజాన్‌ ధర రూ.23,999 గా ఉంది. డార్క్‌ వెల్కిన్‌, సెరినిటీ బ్లూ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్‌లో కూపన్ క్యాష్‌బ్యాక్‌ ద్వారా గరిష్ఠంగా రూ.6000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Tecno Camon 20 premier 5G Smartphone

మరియు బ్యాంకు డిస్కౌంట్‌లతో అదనంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మొత్తంగా రూ.7000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.22,500 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందో అమెజాన్‌ వెల్లడించలేదు. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు మీకోసం.

టెక్నో కెమన్‌ 20 ప్రీమియర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
టెక్నో కెమన్‌ 20 ప్రీమియర్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ 10 బిట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ప్రీమియం లెదర్‌ ఫినిష్‌ డిజైన్‌ తో అందుబాటులో ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత 13 OS పైన పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8050 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు 8GB LPDDR4x ర్యామ్‌ మరియు 512GB స్టోరేజీతో జతచేయబడుతుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీపైన పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌ సెట్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌తో 50MP కెమెరా, మరియు 108MP అల్ట్రా వైడ్‌ కెమెరా, 2MP బొకేష్‌ లెన్స్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు వెనుక LED ప్లాష్‌లైట్‌ రింగ్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Camon 20 premier 5G Smartphone gets massive price drop on amazon 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X