100MP కెమెరా, 70W ఛార్జింగ్ సపోర్టుతో 5G స్మార్ట్‌ఫోన్.. బ్యాంకు కార్డులపై రూ.3000 తగ్గింపు..!!
టెక్నో నుంచి కెమెన్ 30 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు (Tecno Camon 30 5G Series) లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో టెక్నో కెమెన్ 30 5G మరియు టెక్నో కెమెన్ 30 ప్రీమియర్ 5G మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. మరియు 70W ఛార్జింగ్ సపోర్టుతో లాంచ్ అయ్యాయి.
టెక్నో కెమెన్ 30 5G స్పెసిఫికేషన్‌లు :
టెక్నో కెమెన్ 30 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2436 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్‌తో విడుదల అయింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14 పైన పనిచేస్తుంది. 6nm డెమెన్సిటీ 7020 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 100MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాలను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత వేరియంట్లో అందుబాటులో ఉంటుంది.
టెక్నో కెమెన్ 30 ప్రీమియర్ 5G స్పెసిఫికేషన్‌లు :
టెక్నో కెమెన్ 30 ప్రీమియర్ 5G స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల 1.5 LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1264*7800 పిక్సల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14 పైన పనిచేస్తుంది. 4nm డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

ప్రీమియర్ మోడల్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలీఫోటో కెమెరా మరియు 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియోల కోసం ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరాలను కలిగి ఉంటుంది. 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.
70W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా వైఫై, బ్లూటూత్, GPS, GNPS, USB-C ఫీచర్లను కలిగి ఉంటుంది. యాక్సిలిరోమీటర్, గైరో స్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ వంటి సెన్సార్‌లను కలిగి ఉంటుంది. IP53 రేటింగ్‌తోపాటు భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో విడుదల అయింది.
భారత్ మార్కెట్‌లో టెక్నో కెమెన్ 30 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB అంతర్గత వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. అదే కెమెన్ 30 ప్రీమియర్ 5G స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ ధర రూ.39,999 గా ఉంది.
టెక్నో కెమెన్ 30 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్ సేల్ వివరాలు :
టెక్నో కెమెన్ 30 5G, కెమెన్ 30 ప్రీమియర్ 5G స్మార్ట్‌ఫోన్‌లు మే 23 నుంచి సేల్ ప్రారంభం (Tecno Camon 30 5G Series sale) అవుతుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లను అమెజాన్‌లో ICICI బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. రూ.4999 విలువైన స్మార్ట్‌వాచ్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








