Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, వేగాన్‌ లెదర్ డిజైన్‌ స్మార్ట్‌ఫోన్‌ల టీజర్ విడుదల.. స్పెసిఫికేషన్లు, లాంచ్‌ వివరాలు..!!

టెక్నో నుంచి త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి కొత్త సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. టెక్నో కెమెన్‌ 30 సిరీస్‌ (Tecno Camon 30 Series) స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్‌ను సంస్థ ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ విడుదల చేయలేదు. అయితే ఈ సిరీస్‌లో నాలుగు హ్యాండ్‌సెట్‌లు విడుదల కానున్నాయని తెలుస్తోంది.

టెక్నో కెమెన్‌ 30 4G, కెమెన్‌ 30 5G, కెమెన్‌ 30 ప్రో 5G, టెక్నో కెమెన్‌ 30 ప్రీమియర్ 5G స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC) 2024 వేదికగా ఆవిష్కరించారు.

Tecno Camon 30 Series Smartphones launch confirmed

టీజర్‌ విడుదల...
X (ట్విట్టర్) పోస్టు ద్వారా టెక్నో సంస్థ భారత్‌లో ఈ సిరీస్‌ విడుదలపై ప్రకటన చేసింది. అయితే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. టెక్నో విడుదల చేసిన టీజర్‌ ఆధారంగా హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు బ్లాక్‌ వేగాన్‌ లెదర్‌ డిజైన్‌ను గుర్తించవచ్చు.

ఈ నెలలోనే విడుదల :
గ్లోబల్‌ వేరియంట్ తరహాలోనే భారత్‌లో త్వరలో విడుదల కానున్న మోడల్‌ ఉంది. ఫలితంగా స్పెసిఫికేషన్‌లను కూడా అంచనా వేయవచ్చు. ఈ టెక్నో కెమన్‌ 30 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు ఈ నెలలోనే భారత్‌లో విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌ హ్యాండ్‌సెట్‌ ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఈ కింది విధంగా ఉండే అవకాశం ఉంది.

టెక్నో కెమన్‌ 30 4G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G99 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. అదే 5G బేస్‌ మోడల్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అదే ప్రో మరియు ప్రీమియర్ మోడళ్లు మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 soc చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లు 70W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

టెక్నో కెమన్‌ 30 4G, 5G వేరియంట్లు 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్‌ ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. అదే టెక్నో కెమెన్‌ ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 1/1.56 అంగుళాల 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS సపోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP డెప్త్ సెన్సాన్‌ను కలిగి ఉంటుంది.

50MP సెల్ఫీ కెమెరా..
అదే హైఎండ్‌ మోడల్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3X ఆప్టికల్ జూమ్‌ సామర్థ్యంతో 50MP కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు క్వాడ్‌ ఫ్లాష్‌ లైట్‌ యూనిట్‌తో వస్తుంది. అన్ని హ్యాండ్‌సెట్‌లు 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Camon 30 Series Smartphones teased and confirmed to launch in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X