Home
Mobile

బడ్జెట్ ధరలో మార్కెట్లోకి మూడు స్మార్ట్‌ఫోన్లు

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్జజం Tecno దేశీయ విపణిలోకి మూడు స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చింది.

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్జజం Tecno దేశీయ విపణిలోకి మూడు స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చింది. Camon iAir 2+, Camon i2, Camon i2X పేర్లతో వీటిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు ఫోన్లు ఆర్టిపీషియల్ ఫీచర్ తో మార్కెట్లోకి వచ్చాయి. అంతే కాకుండా నాచ్ డిజైన్ స్పెషల్ ఆకర్షణగా ఈ ఫోన్లు ఉండనున్నాయి. ఐ2ఎక్స్‌ ఫోన్ రూ.12,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఐ2 phone రూ.10,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.Camon iAir 2+ ధర రూ. 8,999గా ఉంది.

టెక్నో కామన్ ఐ2ఎక్స్ ఫీచర్లు

టెక్నో కామన్ ఐ2ఎక్స్ ఫీచర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ.

టెక్నో కామన్ ఐ2 ఫీచర్లు

టెక్నో కామన్ ఐ2 ఫీచర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ.

మోటో ఎక్స్4, ఈ5 ప్లస్

మోటో ఎక్స్4, ఈ5 ప్లస్

ఇదిలా ఉంటే మోటోరోలా తన మోటో ఎక్స్4, ఈ5 ప్లస్ ఫోన్ల ధరలను తగ్గించింది. దసరా పండుగ సందర్భంగా ఈ ఫోన్ల ధరలను తాత్కాలికంగా తగ్గించినట్లు మోటోరోలా తెలిపింది. మోటో ఈ5 ప్లస్ రూ.1వేయి తగ్గగా, మోటో ఎక్స్4 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియెంట్ల ధరలు రూ.2వేలు తగ్గాయి.

మోటో ఈ5 ప్లస్

మోటో ఈ5 ప్లస్

మోటో ఈ5 ప్లస్ ధర రూ.11,999 ఉండగా ఇప్పుడది రూ.10,999 ధరకే లభిస్తున్నది. అలాగే మోటో ఎక్స్4 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.15,999 ఉండగా, రూ.13,999 ధరకు ఈ ఫోన్ లభిస్తున్నది.

మోటో ఎక్స్4

మోటో ఎక్స్4

దీంతోపాటు మోటో ఎక్స్4 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.17,999 ధర ఉండగా, రూ.15,999 ధరకే లభిస్తున్నది.

పేటీఎం మాల్‌లో రూ.3వేల క్యాష్‌బ్యాక్‌

పేటీఎం మాల్‌లో రూ.3వేల క్యాష్‌బ్యాక్‌

ఇక ఈ ఫోన్లపై పేటీఎం మాల్‌లో రూ.3వేల క్యాష్‌బ్యాక్‌ను ఇస్తున్నారు. వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్లను ప్రస్తుతం తగ్గిన ధరలకే కొనుగోలు చేయవచ్చని మోటోరోలా ఒక ప్రకటనలో తెలిపింది.

Best Mobiles in India

English summary
Tecno Camon iAir 2+, Camon i2, Camon i2X With Dual Rear Camera, Display Notch Launched in India: Price, Specifications more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X