ట్రై ఫోల్డ్ కాన్సెప్ట్, 10 అంగుళాల డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్.. అత్యంత సన్నని బ్యాటరీ సహా ఎన్నో ప్రత్యేకతలు
టెక్నో తొలిసారిగా వినూత్న ఆవిష్కరణకు తెరతీసింది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్ లో కొత్త ట్రెండ్ సృష్టించే విధంగా ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌ను IFA బెర్లిన్‌లో విడుదల చేసింది. టెక్నో ఫాంటమ్ అల్టిమేట్ 2 కాన్సెప్ట్ ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ హింజ్ మెకానిజం ఆధారంగా పనిచేస్తుంది. ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 (MWC 2024) లో ఈ కాన్సెప్ట్‌ను తొలిసారిగా విడుదల చేసింది. టెక్నో ఫాంటమ్ అల్టిమేట్ తర్వాత తరం వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది. ఈ ఫాంటమ్ ట్రై ఫోల్డ్ కాన్సెప్ట్ ఫోన్ 10 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిపింది.
టెక్నో ఫాంటమ్ అల్టిమేట్ 2 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు
టెక్నో ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ (Tecno Phantom Ultimate 2 Smartphone) 6.48 అంగుళాల కవర్ డిస్‌ప్లే మరియు 10 అంగుళాల LTPO OLED ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 1620*2880 పిక్సల్ రిజల్యూషన్, 4:3 ఆస్పెక్ట్ రేషియో తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ మూడు ఫోల్డబుల్ స్క్రీన్‌లను కలిగి ఉండనుంది.

ఈ హ్యాండ్‌సెట్ టచ్ మరియు డిస్‌ప్లే ఇంటిగ్రేషన్ టెక్నాలజీని కలిగి ఉన్న తొలి స్మార్ట్‌ఫోన్ గా టెక్నో చెబుతోంది. డిస్‌ప్లే డ్రైవర్, టచ్ సెన్సార్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 11mm థిక్‌నెస్ తో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ట్రై ఫోల్డ్ స్ర్కీన్ ను కలిగి ఉన్నా... ప్రస్తుతం ఉన్న ఫోల్డబుల్ ఫోన్‌ల తరహా థిక్‌నెస్‌నే కలిగి ఉంది.
టెక్నో ఫాంటమ్ అల్టిమేట్ 2 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ హింజ్ మెకానిజంను కలిగి ఉంది. ఈ టెస్టింగ్‌లో భాగంగా 300,000 ఫోల్డ్, అన్‌ఫోల్డ్‌లు చేసినట్లు తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ అత్యంత సన్నని అల్ట్రా స్లిమ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ థిక్‌నెస్ కేవలం 0.25mm మాత్రమే ఉంటుంది.
టెక్నో సంస్థ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌ను విడుదల చేసినా.. ఎప్పటి నుంచి ఈ హ్యాండ్‌సెట్ ఉత్పత్తి ప్రారంభం కానుందనే సమాచారాన్ని సంస్థ వెల్లడించలేదు. అయితే అనేక సంస్థలు తమ శక్తి మరియు టెక్నాలజీని హైలెట్ చేసేందుకు ఈ తరహా వినూత్న కాన్సెప్ట్‌లను ఆవిష్కరిస్తుంటాయి.
అయితే టెక్నో కంటే ముందే మరో చైనా సంస్థ Huawei ఈ తరహా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ఇందుకు సంబంధించిన ఈవెంట్‌ను నిర్వహించనుందని సమాచారం. అయితే టెక్నో మాత్రం ఈ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి, విడుదలపై ఎటువంటి సమాచారాన్ని షేర్ చేయలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








