Home
Mobile

6.9 అంగుళాల డిస్‌ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. అమెజాన్ సేల్‌ పూర్తి వివరాలు..!

ప్రస్తుతం ఫ్లిప్‌, ఫోల్డ్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గత సంవత్సరం సెప్టెంబర్‌లో టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ 5G (Tecno Phantom V Flip 5G) ఫోల్డబుల్‌ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ క్లామ్‌ షెల్‌ ఫోల్డబుల్‌ను బ్యాంకు ఆఫర్లతో కలిపి భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా అత్యంత తక్కువ ధరకే ఫ్లిప్‌ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ ధర:
టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ 16GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.54,999 గా ఉంది. కొనుగోలు చేసే సమయంలో రూ.5,000 కూపన్‌ ద్వారా తగ్గింపును పొందవచ్చు. మరియు బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.2,500 వరకు తగ్గింపును పొందవచ్చు. ఎక్స్ఛేంజీ ద్వారా రూ.10,000 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. గరిష్ఠంగా రూ.37,550 వరకు ఎక్స్చేంజీ ప్రయోజనాలు పొందవచ్చు.

Tecno Phantom V Flip 5G Clamshell Foldable Smartphone

టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ ఫోన్ స్పెసిఫికేషన్లు :
టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.9 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.32 అంగుళాల కవర్‌ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

ఈ క్లామ్‌షెల్‌ ఫోల్డబుల్‌ హ్యాండ్‌సెట్ 6nm డైమెన్సిటీ 8050 చిప్‌ను కలిగి ఉంది. మరియు Mail G77 MC9 చిప్‌సెట్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత HiOS 13.5 పైన పనిచేస్తుంది. మరియు ఈ ఫోల్డబుల్‌ హ్యాండ్‌సెట్‌ 45W ఛార్జింగ్ సపోర్టుతో 4000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా వెనుకవైపు 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్‌ 5.1, NFC మరియు USB-C ఛార్జింగ్‌ ఫోర్టును కలిగి ఉంది. ఐకానిక్ బ్లాక్‌ మరియు మైస్టిక్‌ డౌన్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్‌ సంస్థ ఫోల్టబుల్‌ ఐఫోన్‌ను తయారుచేయనుందనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రోటోటైప్‌ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ఆధారంగా ఆపిల్ సంస్థ రెండు క్లామ్‌షెల్ మోడల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ మోడల్‌ ప్రోటోటైప్‌లను అభివృద్ధి తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ Z Flip తరహా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సమాంతరంగా మడతపెట్టే విధంగా ఉంటుంది.

ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్లతోపాటు ఫోల్డబుల్‌ ఐప్యాడ్‌ను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ ఐప్యాడ్‌ ప్రస్తుతం ఉన్న ఐప్యాడ్‌ మిని తరహా 8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆపిల్‌ సంస్థ ఫోల్డబుల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్‌ విడుదలకు సంబంధించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Tecno Phantom V Flip 5G Clamshell Foldable Smartphone gets huge discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X