Home
Mobile

ధర రూ.34,999 ధరకే 50MP + 50MP కెమెరాలు, 6.9 అంగుళాల డిస్‌ప్లే కలిగిన Flip ఫోన్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో నుంచి ఇటీవల టెక్నో ఫాంటమ్‌ V ఫోల్డ్‌ 2 మరియు ఫాంటమ్ V ఫ్లిప్‌ 2 హ్యాండ్‌సెట్‌లను విడుదల అయ్యాయి. రెండు ఫోన్‌లు సెప్టెంబర్‌లోనే గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే భారత్‌ మార్కెట్‌ మాత్రం డిసెంబర్‌ తొలివారంలో లాంచ్‌ అయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల సేల్‌ ప్రారంభం అయింది.

ఇప్పటికే భారత్‌ మార్కెట్‌లో శాంసంగ్‌, వన్‌ప్లస్‌, వివో, మోటోరోలా, ఒప్పో వంటి స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు ఫ్లిప్‌, ఫోల్డ్‌ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చిన టెక్నో ఫోన్‌లు (Tecno Phantom V Fold 2 And Phantom V Flip 2 sale in india) తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Tecno Phantom V Fold 2 and Phantom V Flip 2 Smartphones

టెక్నో ఫాంటమ్‌ V ఫోల్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.79,999 గా ఉంది. అదే V ఫ్లిప్‌ 2 ధర రూ.34,999 గా ఉంది. ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర బ్రాండ్‌ల ఫోల్డ్‌, ఫ్లిప్‌ ఫోన్‌లతో పోలిస్తే భారీగా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.

టెక్నో ఫాంటమ్‌ V ఫోల్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
టెక్నో ఫాంటమ్‌ V ఫోల్డ్‌ 2 (Tecno Phantom V Fold 2 sale on amazon) స్మార్ట్‌ఫోన్‌ 6.42 అంగుళాల FHD+ అమోలెడ్‌ కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 7.85 అంగుళాల 2k+ ఫోల్డబుల్‌ అమోలెడ్‌ ఇన్నర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు డిస్‌ప్లేలు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను కలిగి ఉంది.

Tecno Phantom V Fold 2 and Phantom V Flip 2 Smartphones

ఈ ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9000+ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HiOS 14 ను కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా V ఫోల్డ్‌ 2 ఫోన్‌ 50MP OIS ప్రైమరీ కెమెరా, 2X జూమ్ సామర్థ్యంతో 50MP పొర్ట్రెయిట్‌ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ రెండు 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.

15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 70W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5750mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫాంటమ్‌ V పెన్‌ను సపోర్టు చేస్తుంది. డాల్బీ అట్మాస్‌ ఆధారిత స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌ సహా అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

Tecno Phantom V Fold 2 and Phantom V Flip 2 Smartphones

టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ ఫ్లిప్‌ ఫోన్‌ 6.9 అంగుళాల (Tecno Phantom V Flip 2 sale on Amazon) FHD+ 120Hz LTPO అమోలెడ్‌ ఇన్నర్ డిస్‌ప్లే, 3.64 అంగుళాల అమోలెడ్‌ ఔటర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 8 రక్షణను కలిగి ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8020 SoC చిప్‌సెట్ తో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ‌ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాలు సహా 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 70W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4720mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. ఈ ఫ్లిప్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. మూన్‌ డస్ట్‌ గ్రే, ట్రావెర్టైన్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Phantom V Fold 2 and Phantom V Flip 2 Smartphones sale is live in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X