ధర రూ.6499 కే 5000mAh బ్యాటరీ, 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే ఫోన్.. ఫీచర్లు, సేల్ వివరాలు..!
భారత్ మార్కె్ట్ లో టెక్నో మొబైల్స్ (Tecno Mobile) తాజాగా టెక్నో పాప్ 9 4G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.7000 కంటే తక్కువ ధరతో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ DTS మరియు స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చినా.. ఆకట్టుకొనే డిజైన్ తో విడుదల చేశారు. హ్యాండ్‌సెట్ ధర, స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లు, సేల్ పూర్తి వివరాలు.
టెక్నో పాప్ 9 4G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ (Tecno Pop 9 4G Smartphone) 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్‌తోపాటు 480 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 720*1600 పిక్సల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది.

రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్ లు :
టెక్నో పాప్ 9 4G స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G50 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 Go ఎడిషన్ ఆధారిత HiOS 14 తో పనిచేస్తుంది. రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని టెక్నో తెలిపింది.
3GB వర్చువల్ ర్యామ్ :
ఈ హ్యాండ్‌సెట్ ఒకే స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. 3GB ర్యామ్ + 64GB స్టోరేజీతో విడుదల అయింది. ఇందులో 3GB ఫిజికల్ ర్యామ్ + 3GB వర్చువల్ ర్యామ్‌గా ఉంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పొడిగించే అవకాశం ఉంది.
#TECNOPOP9 makes you #LiveLimitless!
— TECNO Mobile India (@TecnoMobileInd) November 22, 2024
Feel the power with India’s First MediaTek G50 Processor, 6GB* RAM, 64GB Storage, 90Hz Smooth Display, Dual DTS Speakers, and so much more.
Sale starts on 26th Nov, 12 Noon.
Check it out 👉 https://t.co/kkBHSEqlN2#TECNOMobile pic.twitter.com/nfouAwtBNU
5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా టెక్నో పాప్ 9 4G స్మార్ట్‌ఫోన్ 13MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఆటోఫోకస్ ఫీచర్‌తో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 8MP కెమెరాను అమర్చారు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. రిటైల్ బాక్స్‌లో 10W ఛార్జర్‌తో డెలివరీ చేస్తుందని తెలుస్తోంది.
ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా డ్యూయల్ సిమ్, 5G, 4G LTE, బ్లూటూత్ 5.1, Wi-Fi, GPS, NFC, USB-C పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. మరియు DTS స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

టెక్నో పాప్ 9 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
టెక్నో పాప్ 9 స్మార్ట్‌ఫోన్ 3GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,699 గా ఉంది. బ్యాంకు కార్డుల ద్వారా రూ.200 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ సేల్ నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్, స్టార్ట్రైల్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








