Home
Mobile

రూ.6,499 కే 5000mAh బ్యాటరీ, 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌.. అమెజాన్‌లో సేల్‌..!

టెక్నో నుంచి ఇటీవల పాప్‌ 9 4G స్మా్ర్ట్‌ ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ తోపాటు మెరుగైన ఫీచర్‌ లను కలిగి ఉంది. అయితే రూ.6,999 కంటే తక్కువ ధరకే భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నో పాప్‌ 9 4G స్మార్ట్‌ఫోన్‌ (Tecno Pop 9 4G Smartphone Sale) సేల్ ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీ, 13MP కెమెరాలను కలిగి ఉంది. ప్రారంభ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ధర, సేల్‌ వివరాలు :
టెక్నో పాప్‌ 9 4G స్మార్ట్‌ఫోన్‌ 3GB + 64GB స్టోరేజీ వేరియంట్‌ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ.6,649 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.200 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ స్టార్ట్రైల్‌ బ్లాక్, గ్లిట్టరీ వైట్, లైమ్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

Tecno Pop 9 4G Smartphone sale started in india check features and bank offers

టెక్నో పాప్‌ 9 4G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
టెక్నో పాప్‌ 9 4G స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 480 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 720*1600 పిక్సల్స్‌ రిజల్యూషన్‌తో అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్‌ 14 OS :
టెక్నో పాప్‌ 9 4G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 Go ఎడిషన్‌ ఆధారిత HiOS 14 ను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ హీలియో G50 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది.

Tecno Pop 9 4G Smartphone sale started in india check features and bank offers

1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు :
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందుతుందని సంస్థ తెలిపింది. వర్చువల్‌గా 3GB అదనపు ర్యామ్‌ను పొందవచ్చు. దీంతోపాటు మైక్రో SD కార్డుతో 1TB స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

5000mAh బ్యాటరీ :
టెక్నో పాప్‌ 9 4G హ్యాండ్‌సెట్ వెనుక వైపు ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 13MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్‌.. 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ స్కానర్‌ ను అమర్చారు. మరియు IP54 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ DTS స్టీరియో స్పీకర్లు సహా IR ఫీచర్‌ను సపోర్ుట చేస్తుంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్‌ సిమ్‌, 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.1, Wi-Fi, GPS, NFC, USB-C పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Tecno Pop 9 4G Smartphone sale started in india check features and bank offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X