రూ.10,000 కంటే తక్కువ ధరకే 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్‌లోకి టెక్నో మొబైల్స్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ను విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ విడుదల తేదీ సహా స్పెసిఫికేషన్లు, డిజైన్ సహా కలర్ వేరియంట్ల వివరాలు వెల్లడయ్యాయి. టెక్నో పాప్ 9 4G పేరుతో (Tecno Pop 9 4G Smartphone) లాంచ్ కానుంది. ఈ వివరాలను టెక్నో అధికారికంగా ప్రకటన చేసింది. అయితే టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారత్ లో లాంచ్ అయింది.
టెక్నో పాప్ 9 4G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో నవంబర్ 22న లాంచ్ కానుంది. అయితే రూ.10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. భారత్‌లో ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా సేల్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అమెజాన్‌లో లైవ్ పేజీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. కాంప్లిమెంటరీ ఫోన్ స్క్రీన్స్‌తో విడుదల కానుందని తెలుస్తోంది.

టెక్నో పాప్ 9 4G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
టెక్నో పాప్ 9 4G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను తో విడుదల కానుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో G50 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6GB డైనమిక్ ర్యామ్ మరియు 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. మరియు ఈ టెక్నో పాప్ 9 4G స్మార్ట్‌ఫోన్ మూడు సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లను పొందనుందని తెలుస్తోంది. డిజైన్ పరంగా ముందువైపు పంచ్ హోల్ డిజైన్ తో అందుబాటులోకి రానుంది.
5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 13MP ప్రధాన కెమెరాతో విడుదల కానుంది. అయితే వెనుక వైపు మరో కెమెరా, సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది.
DTS స్టీరియో స్పీకర్లు ;
ఈ స్మార్ట్‌ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు DTS ఆధారిత డ్యూయల్ స్టీరియో స్పీకర్‌తో అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు IR రిమోట్ కంట్రోల్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుందని టెక్నో సంస్థ చెబుతోంది.
అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా టెక్నో పాప్ 9 4G స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. లైమ్ గ్రీన్, గ్లిట్టరీ వైట్, స్టార్‌ట్రైల్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ నవంబర్ 22 న లాంచ్ కానుంది. ర్యామ్ సహా ఛార్జింగ్, ఇతర ఫీచర్‌ల వివరాలు తెలియాల్సి ఉంది.
అమెజాన్ లిస్టింగ్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.XX99 గా ఉంది. దీని ఆధారంగా ఈ టెక్నో 4G ఫోన్ ధర రూ.10000 కంటే తక్కువకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.9499 గా ఉంది.


Click it and Unblock the Notifications