48MP కెమెరా, 5000mAh బ్యాటరీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్ల 5G ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్..!
భారత్ మార్కెట్‌లో టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Pop 9 5G Smartphone) గత సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ రూ.10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 48MP ప్రైమరీ కెమెరా. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ IR, NFC వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
టెక్నో పాప్ 9 5G ధర :
టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్ లభిస్తుంది. వీటి ధరలు వరసగా రూ.9499, రూ.9999, రూ.11999 గా ఉన్నాయి.

అమెజాన్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్టంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ధర రూ.8499 నుంచి ప్రారంభం కానుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్ షాడో, అజుర్ స్కై, అరోరా క్లౌడ్ రంగుల్లో లభిస్తుంది.
డిస్‌ప్లే వివరాలు :
డిజైన్ పరంగా ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1612*720 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డైనమిక్ పోర్ట్ ఫీచర్‌ను కలిగి ఉంది.
48MP AI కెమెరా :
కెమెరా విభాగం పరంగా మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు 48MP సోనీ IMX582 ప్రైమరీ AI కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరా ఉంది. అయితే వెనుక వైపు LED ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్ చేసేందుకు అవకాశం ఉందని తెలిపింది.
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ;
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14 తో పనిచేస్తుంది. నాలుగు సంవత్సరాల వరకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని సంస్థ చెబుతోంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉందని తెలిపింది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్ 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 5G, 4G, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో కోసం ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IR, NFC వంటి ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. IR ఫీచర్ ద్వారా ఎలక్ట్రానిక్ డివైస్‌లను నియంత్రించవచ్చు.


Click it and Unblock the Notifications







