ధర రూ.9,499 కే 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!
టెక్నో నుంచి గత నెలలో స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. టెక్నో పాప్ 9 5G పేరుతో (Tecno pop 9 5G Smartphone Sale) ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు రూ.10,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 48MP కెమెరాతోపాటు 5000mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల HD+ (1612*720 పిక్సల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డాట్ ఇన్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డైనమిక్ పోర్ట్ ఫీచర్‌తో విడుదల అయింది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ టెక్నో హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీని కలిగి ఉంది. అదే విధంగా ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14 తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB వరకు వర్చువల్ ర్యామ్ సహా మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
48MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా టెక్నో పాప్ 9 5G స్మా్ర్ట్‌ఫోన్ 48MP సోనీ IMX582 ప్రైమరీ కెమెరా సహా LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
ఈ టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ (Tecno pop 9 5G Smartphone Specs) డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు IR, NFC ను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 189 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9499 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ప్రస్తుతం ప్రారంభం అయింది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ను పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








