రూ.8499 ధరకు ఆకట్టుకొనే డిజైన్, IP64 రేటింగ్, HD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో నుంచి భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం జనవరిలో టెక్నో స్పార్క్ గో 3 ఫోన్, ఫిబ్రవరిలో ఏకంగా 8000mAh బ్యాటరీతో టెక్నో పోవా కర్వ్ 2 5G హ్యాండ్‌సెట్ లాంచ్ అయింది. ఎంట్రీ లెవల్ ధర రేంజ్‌లో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. టెక్నో పాప్ X పేరుతో (Tecno Pop X Smartphone) ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
టెక్నో పాప్ X స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ (720 x 1600 పిక్సల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 260 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ చిల్లీ గ్రీన్, ఫ్లేర్ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఆండ్రాయిడ్ 15 OS :
ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ 12nm ఆక్టా కోర్ Unisoc T7250 ప్రాసెసర్ ను కలిగి ఉంది. 4GB LPDDR4x ర్యామ్, 64GB eMMC స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఒకే స్టోరేజీ వేరియంట్‌లో లాంచ్ అయింది.
13MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా, ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే 10W అడాప్టర్‌ను టెక్నో బాక్స్‌లో అందిస్తుంది.
IP64 రేటింగ్ :
కనెక్టివిటీ పరంగా 4G LTE, బ్లూటూత్ 5.2, వైఫై, GPS, IR ట్రాన్స్‌మిటర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
టెక్నో పాప్ X ఫోన్ ధర, సేల్ వివరాలు :
టెక్నో పాప్ X ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8499 గా ఉంది. ఈ ఫోన్ సేల్ మార్చి 6 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై కొనుగోలుపై రూ.7749 ధరకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
గత నెలలో విడుదల అయిన టెక్నో పోవా కర్వ్ 2 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్, Arm G610 MC2 GPU ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పైన పనిచేస్తోంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలున్నాయి. 13MP సెల్ఫీ కెమెరాను ఉంది. 45W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 8000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.27999 గా ఉంది.


Click it and Unblock the Notifications








