6.78 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా స్మార్ట్‌ఫోన్ పై భారీ ఆఫర్.. సేల్ పూర్తి వివరాలు..!
భారత్‌లో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా అనేక సంస్థలు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అందుబాటు ధరల్లో ప్రముఖ ఫీచర్ల కలిగిన ఫోన్లను విడుదల చేస్తున్నాయి. రూ.10,000 ధర సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తే టెక్నో పోవా 5 ప్రో స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
టెక్నో పోవా 5 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు..
టెక్నో పోవా 5 ప్రో స్మార్ట్‌ఫోన్ (Tecno pova 5 pro) 6.78 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత HiOS 13.1 పైన పనిచేస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.

టెక్నో పోవా 5 ప్రో స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు వెనుకవైపు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 68W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
టెక్నో పోవా 5 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్, 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ రూ.15,999గా ఉంది.
ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు అదే 256GB స్టోరేజీ వేరియంట్‌పైన రూ.1000 డిస్కౌంట్ కూపన్‌ను పొందవచ్చు. మరియు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.5000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్ వేరియంట్ రూ.10,000 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
* టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 29న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ HiOS 14 పైన పనిచేస్తుంది. మరియు 6.78 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 2160Hz PWM డిమ్మింగ్‌తో రానుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీ తో జతచేయబడుతుంది. ఈ ఫోన్ 108MP ప్రైమరీ కెమెరా సహా ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంటుంది. 70W ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








